📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Oman: ఒమన్ లో ధనవంతులకు 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్

Author Icon By Vanipushpa
Updated: June 24, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గల్ఫ్ దేశమైన ఒమన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమన్(Oman) లోని ధనవంతులకు ఇకపై 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్(Income Tax) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2028 జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. గల్ఫ్(Gulf) దేశాల్లో ధనవంతులకు ఆదాయపు పన్ను విధించిన తొలి దేశంగా ఒమన్ నిలిచింది. అయితే ఈ ఇన్ కమ్ ట్యాక్స్ ఏడాదికి 42,000 రియాల్స్ అంటే దాదాపు ఏడాదికి ఒక లక్షా 9వేల డాలర్లు.. మన భారత కరెన్సీలో రూ.94 లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించే వారికే వర్తిస్తుంది.
5 శాతం ఇన్ కమ్ చెల్లించాలని ఆదేశాలు జారీ
ఒమన్ లోని ధనవంతులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఇన్ కమ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని ధనికులకు 5 శాతం ఇన్ కమ్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త రూల్ 2028 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఏడాదికి 42 వేల రియాల్స్ అంటే లక్షా 9వేల డాలర్లు.. మన భారత కరెన్సీలో రూ.94 లక్షలు.. అంతకంటే ఎక్కువ సంపాదించేవారికి ఈ రూల్ వర్తిస్తుందని ఒమర్ ప్రభుత్వం పేర్కొంది.

Oman: ఒమన్ లో ధనవంతులకు 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్

సంక్షేమ పథకాలపై వ్యయం
ఈ కొత్త విధానం ఒమన్ లోని ఒక శాతం ధనవంతులపై ప్రభావం పడొచ్చని బ్లూమ్ బర్గ్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇదే విషయంపై మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మహమ్మద్ బిన్ అల్-సాక్రీ స్పందించారు. ఒమన్ లోని ధనవంతులు ముడి చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని.. సంక్షేమ పథకాలపై వ్యయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(GCC)లో ఆరు దేశాలు ఉన్నాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ. ఇది 1981లో ఏర్పడింది. అయితే ఈ దేశాల్లో ప్రస్తుతం ఒమన్ మాత్రమే తొలిసారిగా ధనవంతులకు ఇన్ కమ్ ట్యాక్స్ విధించింది. ఈ క్రమంలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడంపై దృష్టి సారించాయి. ఓఈసీ డేటా ప్రకారం ఒమర్ ముడి చమురు ఎగుమతుల్లో అగ్రభాగాన ఉంది. 2023 లో 29.3 బిలియన్ డాలర్ల ముడి చమురును ఎగుమతి చేసింది. అధికభాగం చైనాకు ఎగుమతి చేస్తోంది.

Read Also: Stock market: యుద్ధ భయాలు ఉన్నా లాభాల్లోనే సూచీలు

#telugu News 5 Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu imposes Latest News in Telugu oman on Paper Telugu News percent rich Tax Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.