📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు భేటీ

Author Icon By Sharanya
Updated: February 8, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరీతో సమావేశం అయ్యారు. సచివాలయం వేదికగా వీరి భేటీ జరగగా మీటింగ్ లో రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వనరులు, సవాళ్లను సీఎం వివరించారు. వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఏఐ ప్రొఫెషనల్, వన్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నామని అందుకు కేంద్రంతోపాటు నీతి ఆయోగ్‌ సాకారం కూడా కావాలని కోరారు. వికసిత్‌ భారత్‌ 2047 సాధనలో ఏపీ మోడల్‌ స్టేట్‌గా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా హైదరాబాద్ లో తాను అభివృద్ధి చేసిన జినోమ్‌ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు ఉన్నాయని అదే తరహాలో ఏపీలోనూ అత్యుత్తమ విధానాలను అమలు చేయనున్నామని వివరించారు.


అలానే ఈ సమావేశంలో బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, కృత్రిమ మేధ అభివృద్ధిని గ్రోత్‌ ఇంజిన్లుగా గుర్తించామని సీఎం వివరించారు.
ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వనరుల సమీకరణ సహా పలు విషయాల్లోనూ నీతి ఆయోగ్‌ కీలకపాత్ర పోషించాలని కోరారు.
ఏటా 15 శాతం వృద్ధి రేటుతో 2047 వరకి 2.4 ట్రిలియన్ డాలర్ల వృద్ధి తీసుకురావాలి .
అలాగే రాష్ట్రంలో డీజీల్ బస్సుల స్థానంలో 11 వేల ఈవీ బస్సులను ప్రవేశపెడతం. దానితో పాటు రాష్ట్రంలో రూఫుటప్ సోలార్ పవర్ యూనిట్లు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాం అన్నారు .

అందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరపాలని అన్నారు. స్మార్ట్‌ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. సీఎం ప్రతిపాదనలపై సుమన్‌ బేరీ సానుకూలంగా స్పందించారు.ఆయన మొదట ప్రభుత్వ అధికారులతో వైద్యాధికారులతో కలిశారు.విద్య నర్సింగ్ విద్యార్థులు బోధన ఎలా ఉందొ తెల్సుకున్నారు రాష్ట్రానికిది అనుకూల సమయం అని అభివృద్ధికి ఆస్కారముందని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నీతి ఆయోగ్‌ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఇక 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసినప్పటి సంగతులను సుమన్‌ బేరీ గుర్తుచేసుకున్నారు. దేశంలో చాలా మంది సీఎంలున్నా సంస్కరణలను అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. ఐటీకి ప్రోత్సాహం, విమానాశ్రయాలు, ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్లు సహా పలు ఆవిష్కరణలకు నాంది పలికారన్నారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలుచేసే నాయకులతో ప్రజల జీవితాలు మారుతాయన్నారు. వాజపేయీ హయాంలో అమలుచేసిన సంస్కరణలను అందిపుచ్చుకొని అనేక పాలసీలు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రజల జీవితాలు మార్చారని కొనియాడారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా చంద్రబాబు అమలుచేసిన ప్రతి పాలసీని, సంస్కరణలనూ ఆ తర్వాత కాలంలో దేశమంతా పాటించిందని సుమన్‌ బేరీ అన్నారు.

AndhraPradesh Ap News in Telugu Breaking News in Telugu Chandrababu Google News in Telugu Latest News in Telugu NITI Aayog Paper Telugu News suman bery Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.