పాలకొల్లు : గత వైఎస్సార్సీ ప్రభుత్వంలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) పై జరిగిన దాడికి సంబందించిన కేసును సిఐడికి అప్పగించారు. అప్పట్లో దాడి ఘటనపై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, వైఎస్సార్సీ రాజకీయ ప్రమేయంతో కేసు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022లో చేసిన ఫిర్యాదును కేసు నమోదు చేశారు. నర్సాపురం డిఎస్పి (Narsapuram DSP) విచారణనేపథ్యంలో తాజాగా దీనిపై లోతుగాదర్యాప్తు జరిపేందుకు సిఐడికి బదలాయిస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ సిఐడి డిఎస్పీ మోహాన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 లో వైసిపి ప్రభుత్వంలో పాలకొల్లు పట్టణ టిడ్కో గృహాల కాలనీ వద్ద జరిగిన గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

ప్రొటోకాల్ ఉల్లంఘన మధ్య వేదికపైకి రాగానే నిమ్మల రామానాయుడుపై దాడి
అప్పటి మంత్రులు ఆదిమూలం సురేష్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యన్నారాయణ, మరియు అప్పటి నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు గార్లు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం నాటి అధికారిక ఇళ్ళ పంపిణీ సభకు స్థానిక శాసన సభ్యుడు డాక్టర్. నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) అధ్యక్షత వహించవలసి ఉండగా, అధికారుల పిలుపు మేరకు సభాకార్యక్ర మంలో పాల్గొనడానికి, సభావేదికపైకి అప్పటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు, అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ (Angara Rammohan) వేదిక పైకి ఎక్కుచుండగా, ప్రొటోకాల్ లేకుండా సభావేదిక కు సంబందం లేని, వైసిపి కార్యకర్తలు మరికొంతమంది కిరాయి మూకలను కుట్రపూరితంగా వేదికపై ఉంచి స్దానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహాన్ ను, వేదిక పైకి వస్తుండగా, వారిని రాకుండా నిరోధించి వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
నిమ్మల రామానాయుడు వృత్తి ఏమిటి?
నిమ్మల రామానాయుడు (జననం 6 మే 1969) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు మరియు పాలకొల్లు నుండి వరుసగా మూడుసార్లు గెలిచిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Chandrababu Naidu: రేపటినుంచి సిఎం సింగపూర్ పర్యటన