📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Honda Rebel 500: హోండా నుంచి కొత్త బైక్

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో తమ ప్రీమియం మోటార్‌సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరిస్తూ, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) (Honda Motor Cycle) సరికొత్త రెబెల్ 500 బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఆకర్షణీయమైన క్రూయిజర్ బైక్ ధరను రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గురుగ్రామ్, ముంబై, బెంగళూరు(Gurugram, mumbai, Bengulor) వంటి ఎంపిక చేసిన బిగ్‌వింగ్ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో ఈ బైక్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు హోండా బిగ్‌వింగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (HondaBigWing.in) ద్వారా కూడా తమ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. కాగా, 2025 జూన్ నెల నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మిడ్-కెపాసిటీ క్రూయిజర్ విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా హోండా ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పాతకాలపు రెట్రో లుక్‌కు ఆధునిక ఇంజినీరింగ్ హంగులు జోడించి, ప్రీమియం నాణ్యతతో ఈ బైక్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

Honda Rebel 500: హోండా నుంచి కొత్త బైక్

రైడర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభూతి
హోండా రెబెల్ 500 బైక్‌లో 471సీసీ సామర్థ్యం గల, ఇన్-లైన్ 2 సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ 46 హార్స్‌పవర్ (హెచ్‌పీ) శక్తిని, 43.3 న్యూటన్ మీటర్ల (ఎన్ఎమ్) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో రైడర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభూతి లభిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైన్ విషయానికొస్తే, రెబెల్ 500 ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మితమైంది. సులభంగా కూర్చోవడానికి వీలుగా 690 మిల్లీమీటర్ల తక్కువ సీట్ ఎత్తు దీని సొంతం. ఈ బైక్‌లో 11.2 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. దీని బరువు సుమారు 195 కిలోల లోపే ఉండటం గమనార్హం. ఇది దాదాపుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్‌ల బరువుతో సమానం. రెండు వైపులా 16 అంగుళాల ప్రత్యేకమైన చక్రాలు, ముందువైపు ఫ్యాట్ 130-సెక్షన్ టైర్, వెనుకవైపు 150-సెక్షన్ టైర్, భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, నెగెటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటివి ఈ బైక్ ఇతర ముఖ్యమైన ఫీచర్లు.
ధర కాస్త ఎక్కువగా వుంది
భారత మార్కెట్లో ఈ రెబెల్ 500 బైక్… కవాసకి ఎలిమినేటర్ 500 (సుమారు రూ. 3.59 లక్షల నుంచి), రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (సుమారు రూ. 3.68 లక్షల నుంచి), అలాగే సూప‌ర్ మీటియోర్ 650 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. అయితే, ఈ బైక్‌ను సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల దీని ధర కాస్త ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ, ఇదే సంస్థకు చెందిన ఎన్‌ఎక్స్500 మోడల్ కన్నా ఇది రూ.78,000 తక్కువ ధరకు లభిస్తుండగా, దీనికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న కవాసకి ఎలిమినేటర్ 500 కన్నా రూ.64,000 తక్కువ ధరకే రెబెల్ 500 అందుబాటులో ఉంటుందని సమాచారం.

Read Also: Zomato Swiggy: కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్: వర్షం పడితే అదనపు ఛార్జీలు..!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu New bike from Honda Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.