हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Violence in Nepal : భారతీయులను ఆదుకోవాలంటూ నేపాల్ లో ఓ మహిళ వేడుకోలు..

Sai Kiran
Violence in Nepal : భారతీయులను ఆదుకోవాలంటూ నేపాల్ లో ఓ మహిళ వేడుకోలు..

Violence in Nepal : న్యూఢిల్లీ, నేపాల్‌లోని పొఖరాలో ఇరుక్కుపోయిన ఒక భారతీయ పర్యాటకురాలు సహాయం కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జెన్‌జెడ్ నిరసనలు హింసాత్మకంగా మారడంతో (Violence in Nepal) మంగళవారం ప్రజలు రోడ్లపై అల్లర్లు చేసి, ప్రభుత్వ భవనాలు, హోటళ్లు కాల్చివేశారు. దీంతో ప్రధాని కె.పి. శర్మ ఓలీ రాజీనామా చేశారు.

ప్రఫుల్ గార్గ్ పంచుకున్న వీడియోలో ఉపస్థా గిల్ అనే భారతీయ పర్యాటకురాలు మాట్లాడుతూ, “మా హోటల్ మొత్తాన్ని కాల్చేశారు. పర్యాటకులను కూడా విడిచిపెట్టడం లేదు” అని తెలిపింది.

ఆమె వీడియోలో ఇలా చెప్పింది:
“నా పేరు ఉపస్థా గిల్. ఈ వీడియోని ప్రఫుల్ గార్గ్‌కి పంపుతున్నాను. నేను భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థిస్తున్నాను – దయచేసి మాకు సహాయం చేయండి. నేను ప్రస్తుతం నేపాల్‌లోని పొఖరాలో ఇరుక్కుపోయాను. నేను వాలీబాల్ లీగ్ నిర్వహణ కోసం వచ్చాను. కానీ నేను ఉన్న హోటల్ మొత్తం దగ్ధమైంది.

నేపాల్‌లో ఇరుక్కున్న భారత మహిళ ఆవేదన

నా అన్ని సామాన్లు, లగేజ్ అన్నీ గదిలోనే ఉన్నాయి. నేను స్పాలో ఉన్నప్పుడు, కర్రలతో వెనకాల పరుగెత్తి కొట్టడానికి వచ్చారు. నేను ప్రాణాలు బట్టకట్టుకుని తప్పించుకున్నాను.

ఇక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా అగ్నిప్రమాదాలు చేస్తున్నారు. ఎవరు పర్యాటకులా, ఎవరు పనిమీద వచ్చారో పట్టించుకోవడం లేదు. విచక్షణ లేకుండా అగ్నిప్రమాదాలు చేస్తున్నారు.

మేము మరో హోటల్‌లో తాత్కాలికంగా ఉన్నాము. కానీ ఎంతకాలం ఇలాగే ఉంటామో తెలియదు. అందుకే ఈ వీడియో ద్వారా నేను రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేస్తున్నాను – దయచేసి మాకు సహాయం చేయండి. ఇక్కడ నాతోపాటు మరెందరో భారతీయులు ఇరుక్కుపోయారు,” అని ఆమె తెలిపింది.

ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం అడ్వైజరీ విడుదల చేసింది. “పరిస్థితి స్థిరపడే వరకు భారత పౌరులు నేపాల్‌కి ప్రయాణం వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం నేపాల్‌లో ఉన్న భారతీయులు బయటకు వెళ్లకుండా, తాము ఉన్న ప్రదేశంలోనే సురక్షితంగా ఉండాలి. స్థానిక ప్రభుత్వ సూచనలతో పాటు భారత రాయబార కార్యాలయం ఇచ్చే సలహాలను తప్పక పాటించాలి” అని పేర్కొంది.

అంతేకాకుండా, భారత్-నేపాల్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశారు. కాఠ్మాండు సహా పలు నగరాల్లో ఆంక్షలు అమలు చేసేందుకు సైన్యాన్ని మోహరించారు.

Read also :

https://vaartha.com/gold-silver-prices-sep-10-2025/today-gold-rate/544329/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870