📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Mohammed Shami: షమీ ఓ క్రిమినల్..అతడిపైన పోరాటం ఆగదు: హసీన్ జహాన్

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా హసీన్ జహాన్ (Hasin Jahan), సోషల్ మీడియాలో షమీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. షమీకి వ్యక్తిత్వం లేదని, అతడు క్రూరమైన మనస్తత్వం ఉన్నవాడని హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారి విడాకుల కేసులో కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్ది రోజులకే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.హసీన్ జహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్టు చేశారు. గత ఏడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని, షమీ (Mohammed Shami) తన దురాశతో కుటుంబాన్ని నాశనం చేశాడని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. “మమ్మల్ని అంతమొందించడానికి, పరువు తీయడానికి ఎంతమంది క్రిమినల్స్‌కు డబ్బులిచ్చావో? వేశ్యలకు, నేరస్థులకు ఇచ్చిన డబ్బును మన కుమార్తె భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే మన జీవితం గౌరవంగా ఉండేది” అని హసీన్ జహాన్ ఆ పోస్టులో పేర్కొన్నారు.

Mohammed Shami:షమీ ఓ క్రిమినల్..అతడిపైన పోరాటం ఆగదు: హసీన్ జహాన్

షమీని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు

భగవంతుడు తనకు ఎంతో ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడని, అందుకే నిజం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని ఆమె తెలిపారు. “పురుషాధిక్య సమాజం (Society) లో నిందలేసి నువ్వు మద్దతు పొందగలవేమో కానీ, ఏదో ఒకరోజు నీకూ కష్టకాలం తప్పదు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అంటూ షమీని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ షమీ, హసీన్ జహాన్‌లకు 2014లో వివాహం కాగా, వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో 2018 నుంచి విడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ ధాఖలు చేసిన గృహ హింస కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు, వారి కుమార్తె సంరక్షణ కోసం భరణం చెల్లించాలంటూ కలకత్తా హైకోర్టు (Kolkata High Court) షమీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హసీన్ జహాన్ తాజా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Mohammed Siraj: సిరాజ్ సూపర్ ‘సిక్స్’… ఇంగ్లండ్ ఆలౌట్

#CelebrityControversy #CricketerNews #CricketerScandal #DivorceBattle #FamilyDispute #HasinJahan #HasinJahanPost #IndianCricket #InstaAllegations #LegalBattle #mohammedshami #ShamiControversy #ShamiNews #ShamiVsHasin #SocialMediaDrama Ap News in Telugu Breaking News in Telugu character assassination cricketer legal issues custody and divorce family dispute Google News in Telugu Hasin Jahan Hasin Jahan accusations Hasin Jahan allegations Indian Cricket News Indian cricketer Instagram post Latest News in Telugu legal battle Mohammed Shami Paper Telugu News Shami controversy Shami divorce case Shami personal life Shami personal scandal Shami wife controversy social media outburst Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.