हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Windows 11-యూజర్లకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్

Vanipushpa
Latest Telugu News: Windows 11-యూజర్లకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్(Microsoft) యూజర్లకు భారీ షాకిచ్చింది. అక్టోబర్ 2025 నుంచి విండోస్ 10(Windows 10) కి మద్దతును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి విండోస్ 10 పై ఎటువంటి ఉచిత భద్రతా అప్ డేట్లు కాని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభించవని తెలిపింది. విండోస్ 10ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది.ఎందుకంటే భద్రతా అప్ డేట్లు లేకపోతే హ్యాకర్లు, మాల్వేర్‌లు, వైరస్‌లు సులభంగా కంప్యూటర్‌(Computer)ను ధ్వంసం చేయవచ్చని హెచ్చరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మైక్రోసాఫ్ట్ కొన్ని కొత్త అవకాశాలను కూడా ప్రకటించింది. సాధారణ వినియోగదారులు తమ Windows 10 పరికరాలను భద్రతగా ఉంచుకోవాలంటే 30 డాలర్లు చెల్లించి అదనపు భద్రతా అప్ డేట్లను వచ్చే సంవత్సరం (2026 అక్టోబర్) వరకు పొందవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్. చాలా మంది ఈ ఆఫర్‌ను సరైనది కాదని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు విండోస్ 10పై భద్రతా Updates ఉచితంగా లభించేవి.

Windows 11-యూజర్లకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
Windows 11-యూజర్లకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్

డేటాను భద్రపరచడంలో సహాయపడుతుంది

ఈ30 డాలర్లు చెల్లింపు కాకుండా మరో రెండు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకటి, విండోస్ బ్యాకప్ యాప్ ద్వారా మీ ముఖ్యమైన డేటాను OneDriveలో నిల్వ చేసుకోవడం. ఇది డేటాను భద్రపరచడంలో సహాయపడుతుంది. రెండవది Microsoft Rewards పాయింట్లు ఉన్నవారు 1000 పాయింట్లను రీడీమ్ చేసుకొని కూడా భద్రతా అప్ డేట్లను పొందడం.. అయితే, పబ్లిక్ ఇంటరెస్ట్ రీసెర్చ్ గ్రూప్ (PIRG) వంటి వినియోగదారు సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. పాత పరికరాలు Windows 11కి అప్‌గ్రేడ్ కాలేనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల, మిలియన్ల కొద్దీ మంచి కంప్యూటర్‌లు చెత్తకుప్పల్లోకి వెళ్లే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒక్క సంవత్సరం మాత్రమే భద్రతా మద్దతు

వ్యవసాయానికి, వ్యాపార సంస్థలు మూడు సంవత్సరాల పాటు పొడిగించిన భద్రతా మద్దతు పొందుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు మాత్రం ఒక్క సంవత్సరం మాత్రమే భద్రతా మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు సాంకేతిక నిపుణులు ఈ మద్దతును కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు అందించాలని, తద్వారా పాత పరికరాలను ఉపయోగించుకుంటూ భద్రతా సమస్యలు ఎదుర్కోవకుండా ఉంచవచ్చని అంటున్నారు.

Windows 11కి అప్‌గ్రేడ్ చేయడం బెటర్

ఇప్పుడైతే విండోస్ 10 వినియోగదారులు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 30 డాలర్లు చెల్లించి భద్రతా అప్ డేట్లు పొందడం, Microsoft Rewards పాయింట్లు ద్వారా మద్దతు పొందడం లేదా OneDrive లో డేటాను నిల్వ చేసుకోవడం మార్గాలుగా కనిపిస్తున్నాయి. మీ కంప్యూటర్ Windows 11కి అప్‌గ్రేడ్ చేయడం బెటర్. అయితే అన్ని పాత పరికరాలు దీనిని మద్దతు ఇవ్వవు. అందువల్ల, మీ పరికరానికి Windows 11 అనుకూలమా, లేదో పరిశీలించటం చాలా అవసరం. మొత్తానికి, భద్రతా అప్ డేట్లు లేకపోవడం వల్ల చాలా పెద్ద సమస్యలు ఎదురవ్వొచ్చు. అందుకే వినియోగదారులు ముందుగానే తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

మైక్రోసాఫ్ట్ CEO ఎవరు?
సత్య నాదెళ్ల సత్య నారాయణ నాదెళ్ల
సత్య నాదెళ్ల ఎవరు. సత్య నారాయణ నాదెళ్ల మైక్రోసాఫ్ట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)

మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు ఏమిటి?
వ్యాపారాలకు అత్యంత ఉపయోగకరమైన మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు - టెక్నిటా
మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ 365 ఉత్పాదకత సూట్ (వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఔట్లుక్), ఎక్స్‌బాక్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ మరియు హార్డ్‌వేర్, సర్ఫేస్ పరికరాలు మరియు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌తో సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pm-modi-mukesh-ambani-wishes-pm-narendra-modi-on-his-birthday/national/549007/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870