📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Trump: మెలానియా పౌరసత్వంపై కొనసాగుతున్న నిరసన సెగ

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన వారిని తిరిగి వారి దేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని(US Citizenship) దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలున్న వారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని కామెంట్ చేశారు. ట్రంప్ (Trump)వ్యాఖ్యలపై అమెరికన్లు సెటైర్లు వేసుకుంటున్నారు..
ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంతకాల సేకరణ
ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆన్‌లైన్ వేదికగా ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సంతకాల సేకరణ చేస్తున్నారు. ముందు ట్రంప్ తన భార్య మెలానియాను బహిష్కరించాలంటూ ఉన్న పిటిషన్‌కు అనుకూలంగా వేలమంది సంతకాలు చేస్తున్నారు. పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ MoveOn.org ఈ ఆన్‌లైన్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించింది. ట్రంప్ ముందుగా ఆయన తన భార్య మెలానియా, ఆమె తల్లిదండ్రులను దేశం నుంచి బహిష్కరించాలి. అలానే బారన్ ట్రంప్(ట్రంప్ చిన్న కొడుకు)ను కూడా అమెరికా నుంచి డిపోర్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Trump: మెలానియా పౌరసత్వంపై కొనసాగుతున్న నిరసన సెగ

మెలానియా పౌరసత్వంపై ఉన్న వివాదం ఏంటంటే..
మెలానియా ట్రంప్ 2001లో పొందిన ఈబీ-1 వీసా (ఐన్‌స్టీన్ వీసా) ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది. మెలానియా జన్మించింది స్లోవేనియాలో. ఆమె అసలు పేరు మెలనియా క్నావ్స్. ఆమె స్లోవేనియా దేశంలో నోవో మెస్టో అనే గ్రామంలో జన్మించారు. సెవ్నికా అనే గ్రామంలో ఆమె తన బాల్యాన్ని గడిపారు. 16 ఏళ్ల వయసులో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పారిస్, మిలన్ నగరాలకు వెళ్లి మోడల్‌గా పేరు తెచ్చుకున్నారు. 1996లో వీసా ద్వారా అమెరికాకు వచ్చారు. 2000 సంవత్సరంలో మెలానియా ఈబీ-1 వీసా కోసం అప్లై చేసుకున్నారు. అదే ఏడాది ఆమెకు వీసా మంజూరయ్యింది. ఇక 2005లో ఆమె ట్రంప్‌ను పెళ్లి చేసుకున్నారు.
ఐన్‌స్టీన్ వీసా (ఈబీ-1) అంటే?
ఐన్‌స్టీన్ వీసా (ఈబీ-1) అంటే అమెరికా ప్రభుత్వం గొప్ప ప్రతిభ ఉన్నవాళ్లకు ఇచ్చే ప్రత్యేక వీసా. నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వాళ్లకు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ అవార్డులు పొందిన వాళ్లకు మాత్రమే ఈ వీసా జారీ చేస్తారు. మెలానియాకు నిజంగానే అంతటి గుర్తింపు ఉందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

Read Also: Kidnap: మాలిలో భారతీయుల కిడ్నాప్‌ కలకలం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu donald trump immigration policy first lady citizenship issues Google News in Telugu Latest News in Telugu melania immigration controversy melania trump citizenship melania trump naturalization melania visa controversy Paper Telugu News protests over melania trump Telugu News online Telugu News Paper Telugu News Today trump family immigration scandal trump immigration hypocrisy us citizenship debate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.