📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Major Platforms: 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్.. మీ ఖాతాల పాస్‌వర్డ్ మార్చుకోవడం మంచిది

Author Icon By Vanipushpa
Updated: June 21, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘన చోటు చేసుకుంది. మేజర్ ఫ్లాట్ ఫాం(Major Platforms)ల నుంచి దాదాపు 16 బిలియన్ ఖాతాలు హ్యాక్ చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద డేటా ఉల్లంఘన ఇదేనని నిపుణులు చెబుతున్నారు. గూగుల్, ఆపిల్, టెలిగ్రామ్, జిమెయిల్(Google, Apple, Telegram) ఇతర ప్రధాన సేవలతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ల (1,600 కోట్ల) వినియోగదారుల పాస్‌వర్డ్‌(Password)లు దొంగిలించారని ఫోర్బ్స్, సైబర్ న్యూస్ వార్తా సంస్థ(Cyber News Vaartha Angecy)లు నివేదికలు విడుదల చేశాయి. ఈ దొంగిలించిన పాస్‌వర్డ్‌లను ఇంటర్నెట్‌లో డార్క్ వెబ్‌లో విక్రయిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీని ద్వారా, హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇమెయిల్, గూగుల్ ఖాతాలు, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా నుండి ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వరకు వివిధ ఆన్‌లైన్ సేవలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.

Major Platforms: 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్.. మీ ఖాతాల పాస్‌వర్డ్ మార్చుకోవడం మంచిది

ప్రపంచంలోని 16 బిలియన్ ఖాతాల యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు, ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారం దొంగిలించారు. ఈ దొంగతనంలో ఇండియన్ల సమాచారం ఎంత దొంగిలించారో కనుక్కోవాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In)ని కోరింది. CERT-In సమాచారాన్ని సేకరించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
టెక్స్ట్ మెసేజ్ లేదా ఇమెయిల్ క్లిక్ చేయవద్దు
హ్యాకర్లు తరచుగా ఒక నిర్దిష్ట వెబ్‌సైట్‌కు సంబంధించిన నకిలీ లింక్‌ను క్రియేట్ చేసి ఓ వ్యక్తి మొబైల్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ లేదా ఇమెయిల్ ద్వారా పంపుతారు.యూజర్ వెంటనే దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిగ్గా కొన్ని వివరాలు డిస్ ప్లే అవుతాయి. యూజర్లు ఆ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, హ్యాకర్లు వాటిని హ్యాక్ చేసి డార్క్ వెబ్ సైట్‌లలో చట్టవిరుద్ధంగా అమ్మకానికి పెడతారు.ఆ వివరాలతో కొందరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారు. ఈ ప్రాసెస్ లో సామాన్యులే తమకు తెలియకుండానే ఎక్కువగా బలి పశువులు అవుతున్నారు.
మీ మొబైల్‌లో OTP వచ్చేలా సెట్ చేసుకోండి
కాబట్టి ఎవరూ కూడా అవాంఛిత ఈమెయిల్స, లింక్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి వాటిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మీరు ఇలాంటి వాటి భారీన పడి ఉండే వెంటనే మీ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చండి. మీ ఖాతాలకు మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్ (MFA) / టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) ఉపయోగించండి. మీ మొబైల్‌లో OTP వచ్చేలా సెట్ చేసుకోండి. దీంతో పాటు అన్ని ఖాతాలకు ఒకే పాస్ వర్డ్ ఉపయోగించవద్దు.

Read Also: Gaurav Chintamanidi: అమెరికాలో ఉద్యోగం పూలపాన్పు కాదు..ఓ భారతీయుడి ఆవేదన

#telugu News 16 billion passwords leaked Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu It is better to Latest News in Telugu Major Platforms: Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today the password of your accounts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.