📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Lalith-Mallya: లలిత్ మోదీ – విజయ్ మాల్యా కలిసి పాట పాడుతూ చిందులు!

Author Icon By Vanipushpa
Updated: July 4, 2025 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ(Lalith Modi), కింగ్‌ఫిషర్‌ కంపెనీ ఓనర్ విజయ్ మాల్యా(Vijaya Mallya) గురించి తెలియని వాళ్లుండరు. భారత్‌లో మనీలాండరింగ్‌తో పాటు ఇతర కేసుల్లో ఇరక్కుని వీళ్లిద్దరూ లండన్‌(London) పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీళ్లకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ గడిపిన ఓ వీడియో బయటపడింది. ఐ డిడ్ ఇట్ మై వే(“I Did It My Way”) అంటూ అప్పటి అమెరికన్ సింగర్‌ ఫ్రాంక్‌ సినాత్రా పాడిన పాటను విజయ్ మాల్యా, లలిత్‌ మోదీ కలిపి పాడుతూ ఎంజాయ్ చేశారు. పార్టీ సమయంలో లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి అమెరికన్ గాయకుడు ఫ్రాంక్ సినాత్రా ప్రసిద్ధ పాట “I Did It My Way” పాడుతూ ఆనందంగా గడిపారు. ఈ వీడియోను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Lalith-Malya: లలిత్ మోదీ – విజయ్ మాల్యా కలిసి పాట పాడుతూ చిందులు!

గత ఆదివారం లలిత్‌ మోదీ తన నివాసంలో పార్టీ ఇచ్చారు. అక్కడికి విజయ్‌ మాల్యా కూడా వచ్చి ఆనందంగా గడిపారు. ఈ పార్టీలో వాళ్లిద్దరూ కలిసి పాడిన వీడియోను లలిత్‌ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేకాదు ముందుగానే ఏం జరుగుతుందో అని ఊహిస్తూ ” కచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. కానీ నాకు బాగా నచ్చేది అదే” అంటూ సందేశం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే లలిత్‌ మోదీ ఇచ్చిన ఈ పార్టీకి ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరైనట్లు ఆయన తెలిపారు. వీళ్లలో మాజీ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ కూడా ఉన్నారు.

లలిత్‌ మోదీ 2010 దేశం విడిచి లండన్‌కు పారిపోయాడు

ఇదిలాఉండగా లలిత్‌ మోదీపై బిడ్‌ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడు 2010 దేశం విడిచి లండన్‌కు పారిపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఇక విజయ్‌ మాల్యా బ్యాంకుల నుంచి రూ.9 వేలు కోట్ల రుణాలు ఎగవేత కేసులో ఇరుక్కుని లండన్‌కు పారిపోయారు. 2017లో లండన్‌లో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై అక్కడే ఉంటున్నారు. ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వీడియోను పోస్ట్ చేస్తూ లలిత్ మోదీ “ఇది కచ్చితంగా వివాదాస్పదం అవుతుంది, కానీ నాకు నచ్చినదే” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Read Also: hindi.vaartha.com

Read Also:India: దలైలామా వారసుడిపై చైనా జోక్యం – భారత్‌ ఖండన

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Chris Gayle party Lalit Modi Frank Sinatra song viral Google News in Telugu I Did It My Way song video IPL founder news Lalit Modi Lalit Modi controversies Lalit Modi Instagram video Lalit Modi party video Latest News in Telugu London luxury party London party Lalit Modi Money Laundering Case Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Vijay Mallya Vijay Mallya bail status Vijay Mallya bank fraud Vijay Mallya London Vijay Mallya viral video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.