हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Stock Market: స్టాక్ సూచీలకు ఇజ్రాయెల్–ఇరాన్ సెగలు

Shobha Rani
Stock Market: స్టాక్ సూచీలకు ఇజ్రాయెల్–ఇరాన్ సెగలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో ప్రారంభంలోనే సెక్సెక్స్‌ (Sensex) 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ (Nifty) 24,600 దిగువకు చేరింది. చివరకు రెండు ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

గణనీయంగా పడిపోయిన రూపాయి విలువ

సెన్సెక్స్‌ ఉదయం 80,427.81 పాయింట్ల (క్రితం ముగింపు 81,691.98) వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,354.59 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 24,473.00 వద్ద కనిష్ఠాన్ని తాకిన నిఫ్టీ చివరకు 169 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.07 గా ఉంది.

మార్కెట్ భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు

ముడి చమురు (Crudoil) ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీశాయి. ముఖ్యంగా చమురు రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటాన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఎటర్నల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

Stock Market: స్టాక్ సూచీలకు ఇజ్రాయెల్–ఇరాన్ సెగలు
Stock Market: స్టాక్ సూచీలకు ఇజ్రాయెల్–ఇరాన్ సెగలు

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75.39 డాలర్ల వద్ద ట్రేడవగా.. బంగారం ఔన్సు 3,445 డాలర్ల వద్ద కొనసాగింది. ఇజ్రాయెల్–ఇరాన్ సంక్షోభం అంతర్జాతీయ మార్కెట్లను మాత్రమే కాకుండా, దేశీయ మార్కెట్లపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతోంది. చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి మారకం విలువ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యూహాలు అమలు చేయాలి.

Read Also: Telecom Department: మొబైల్ వినియోగదారులకి టెలికాం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870