ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఉదయం భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు.. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇరాన్ (Iran) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మిస్సైల్స్‌తో దాడులు చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ (Sensex) దాదాపు 1100 పాయింట్ల మేర పతనమైంది. దీంతో నిఫ్టీ 25,050 దిగువకు చేరింది.
అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ (Sensex) ఉదయం 82,534.61 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,896.79) భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ (Sensex) 83,018.16 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో ఓ దశలో 81,900.12 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి సెన్సెక్స్ (Sensex) 158.32 పాయింట్ల లాభంతో 82,055.11 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 72.45 పాయింట్ల లాభంతో 25,044.35 వద్ద స్థిరపడింది.

రూపాయి బలపడింది
అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ట్రెంట్, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 69.39 డాలర్లు, బంగారం ఔన్సు 3,334 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ దాదాపు 81 పైసలు బలపడి 85.97గా ఉంది.
Read Also: Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..3 వేలు తగ్గిన