📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

హిండ్‌వేర్ నూతన సీఈఓగా నిరుపమ్

Author Icon By sumalatha chinthakayala
Updated: January 27, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ : భారతదేశంలోని ప్రముఖ బాత్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన హిండ్‌వేర్ లిమిటెడ్, తన శానిటరీవేర్, కుళాయిలు మరియు టైల్స్ వ్యాపారాల తదుపరి అభివృద్ధి దశకు నాయకత్వం వహించడానికి నిరుపమ్ సహాయ్‌ను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.

నిరుపమ్ విస్తృతమైన నాయకత్వ అనుభవాన్ని మరియు విభిన్న రంగాల్లో వృద్ధి, లాభదాయకతను సాధనలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నారు. డిక్సన్ టెక్నాలజీస్ నుండి వచ్చి ఆయన హిండ్‌వేర్‌లో చేరారు, అక్కడ ఆయన లైటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన కెరీర్‌లో ఫిలిప్స్ లైటింగ్, GE క్యాపిటల్, వర్ల్‌పూల్ మరియు ఏషియన్ పెయింట్స్‌లను తన నాయకత్వంతో ముందుకు నడిపించారు, వీటి ద్వారా ఆయన లైటింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పెయింట్స్ మరియు ఆర్థిక సేవల రంగాల్లో విస్తృతమైన అనుభవం గడించారు. తన నాయకత్వ చతురతను ప్రదర్శిస్తూ, నిరుపమ్ రెక్సామ్ డిక్సన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు GE మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో అద్భుత పనితీరును కనబరిచారు అలాగే ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్ కోసం సలహా మండలి సభ్యులుగా పనిచేస్తున్నారు.

కొత్త CEO ప్రకటన సందర్భంగా, హిండ్‌వేర్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సోమానీ మాట్లాడుతూ.. “నిరుపమ్ నిరూపితమైన నాయకత్వం, భారతీయ మార్కెట్‌పై అతనికి గల లోతైన అవగాహన మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించే తత్వం హిండ్‌వేర్ బాత్‌వేర్ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో సహాయపడుతుంది. విశ్వసనీయమైన మరియు వినూత్నమైన బ్రాండ్‌గా హిండ్‌వేర్ స్థానాన్ని ఆయన మరింత బలోపేతం చేస్తారని మేము విశ్వసిస్తున్నాం” అని అన్నారు.

“భారతీయ గృహాలతో బలమైన అనుబంధం కలిగిన ఐకానిక్ బ్రాండ్ అయిన హిండ్‌వేర్‌లో చేరడం నాకు గౌరవంగా మరియు ఉత్సాహంగా ఉంది” అని నిరుపమ్ సహాయ్ అన్నారు. “నాణ్యత, ఆవిష్కరణ మరియు నమ్మకంలతో కూడిన హిండ్‌వేర్ యొక్క అద్భుతమైన వారసత్వం భవిష్యత్ వృద్ధికి బలమైన పునాదిని అందిస్తుంది. రోజురోజుకీ మారుతున్న కస్టమర్ అవసరాలను తీర్చడం అలాగే సరికొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి ముందుచూపుతో ఆలోచించే విధానాన్ని అనుసరించడంపై ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. స్థిరమైన వృద్ధిని కొనసాగించుట మరియు వాటాదారులందరి కోసం విలువను సృష్టించడం కోసం ఈ బృందంతో కలిసి పనిచేసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.” నిరుపమ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బిఎ ఆనర్స్ ఎకనామిక్స్ డిగ్రీని, SVPKM నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (NMIMS) నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు అలాగే వార్టన్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (AMP) పూర్తి చేశారు.

Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu goole news Hindware Limited Latest News in Telugu new CEO Nirupam Sahai Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.