📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Harry Brook: గిల్‌తో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సరదా సంభాషణ

Author Icon By Anusha
Updated: July 6, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అతడిని నిలువరించలేక ఇంగ్లండ్ ఆటగాళ్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అతడితో జరిపిన సరదా సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత్ ఆధిక్యం 450 పరుగులకు చేరువవుతున్న తరుణంలో “కెప్టెన్, 450 పరుగుల వద్ద డిక్లేర్ చేసేయండి. రేపు మధ్యాహ్నం వర్షం పడుతుంది” అని బ్రూక్ (Harry Brook) అనడం వినిపించింది. దీనికి గిల్ నవ్వుతూ, “అది మా దురదృష్టం” అని బదులిచ్చాడు. అంతటితో ఆగకుండా బ్రూక్, “అయితే మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోండి” అని మరో సలహా ఇచ్చాడు. ఈ సరదా వాగ్వాదం మైదానంలో నవ్వులు పూయించింది.

ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 162 బంతుల్లో 161 పరుగులు సాధించి భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివరి సెషన్‌లో భారత్ 427/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ఇంగ్లండ్‌ (England) కు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. క్రీజు (Crease) లో హ్యారీ బ్రూక్ (15), ఓల్లీ పోప్ (24) ఉన్నారు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలంటే, చివరి రోజు భారత్ మరో 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 556 పరుగులు అవసరం.
Read hindi news: hindi.vaartha.com

Read Also: Neeraj Chopra: NC Classic 2025లో నీరజ్ చోప్రా విజయం

#CricketBanter #CricketEntertainment #CricketHumour #CricketViralVideo #EnglandVsIndia #FunnyCricket #GillOnFire #GillVsBrook #HarryBrook #INDvsENG #ShubmanGill #StumpMicMoments #StumpMicTalk #TestCricket #ViralCricket Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.