📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధిపై వడ్డీ రేటును మార్చని ప్రభుత్వం

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిన్న పొదుపు పథకాల కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవింగ్స్ స్కింలలో సుకన్య సమృద్ధి యోజన (SSY) చాల పాపులర్ అయ్యింది. ఈ పథకం కింద ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి కూతురి చదువు, పెళ్లి కోసం డబ్బు సేవింగ్స్ చేయవచ్చు. ఈ పథకంపై అందించే వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేటును సమీక్షించి ఎప్పటిలాగే పాత స్థాయిలోనే కొనసాగించింది.
సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వం అందించే ప్రత్యేక పథకం. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచారం కింద దీన్ని ప్రారంభించారు. ఈ పథకం ఉద్దేశ్యం ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితం ఉంచడం. ఈ పథకం కింద తల్లిదండ్రులు వారి కూతురి కోసం డబ్బు సేవింగ్స్ చేయవచ్చు. ఈ డబ్బును పిల్లల చదువు లేదా పెద్దయ్యాక పెళ్ళికి వినియోగించుకోవచ్చు.

వడ్డీ రేటు ఎంతంటే ?

చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. దింతో ఇప్పుడు 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. అలాగే ఈ వడ్డీ రేటు 8.2% వద్దనే ఉంచింది. పోస్టాఫీసులోని ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు ఎక్కువ. ఎంత డబ్బు డిపాజిట్ చేయవచ్చు: సుకన్య సమృద్ధి యోజన (SSY)లో డిపాజిట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ పథకం కింద అకౌంట్ తెరవడానికి ఏడాదికి కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేయాలి. ఈ మొత్తం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఈజీగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఒక సంవత్సరంలో అత్యధికంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తం కూడా ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు.
మెచూరిటీ ప్రయోజనాలు
సుకన్య సమృద్ధి యోజనలో జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం కలుపుతారు. ఈ వడ్డీ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. ఈ అకౌంట్ మెచూరిటీ అయినప్పుడు పెట్టుబడి మొత్తంతో వడ్డీ మొత్తం టాక్స్ ఫ్రీగా ఉంటుంది. ఈ పథకం కాలపరిమితి 21 సంవత్సరాలు లేదా మీ కుమార్తె పెళ్లి వరకు, ఏది ముందు అయితే అది పరిగణిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన కింద ఒక ప్రత్యేక సౌకర్యం ఏమిటంటే మీరు మీ కుమార్తె చదువు కోసం కూడా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. మీ కుమార్తెకు 18 సంవత్సరాలు నిండినప్పుడు లేదా 10వ తరగతి పాసైనాక కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే గత ఆర్థిక సంవత్సరం చివరిలో అకౌంట్లో ఉన్న మొత్తంలో 50% వరకు మాత్రమే మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా ప్రతి సంవత్సరం వాయిదాలలో అంటే 5 సంవత్సరాలలో విత్ డ్రా చేసుకోవచ్చు.

Read Also: Gensol: జెన్సోల్ ఫౌండర్ సహా ప్రమోటర్ అరెస్టు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu changing interest rate Google News in Telugu Government not changing Latest News in Telugu on Sukanya Samriddhi Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.