हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Gold price: నేడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

Vanipushpa
Gold price: నేడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

పసిడి ధరలు(Gold price) హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర నిన్న పెరగగా ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయం (International)గా నెలకున్న పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకోబోయే కీలక నిర్ణయాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గడంతో పసిడి ప్రియుల్లో సంతోషం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే అమెరికా(America)లో ఆగస్ట్ 1 నుంచి డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే 10% ప్రాథమిక టారిఫ్‌ను అమలు చేశారు. అయితే ఎక్కువ దేశాలకు ఈ టారిఫ్ అమలు తేదీని వాయిదా వేశారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం.. అమెరికా ఇప్పటికీ అనేక బహుళ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసే దశలో ఉంది. నేటి నుంచి కొత్త అధిక సుంకాల రేట్లను ఇతర దేశాలకు తెలియజేయనుంది. ఈ సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే, ఈ మూడు వారాలు ప్రభావిత దేశాలకు చర్చలు కొనసాగించడానికి గడువుగా ఉన్నాయి.

Gold price: నేడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
Gold price: నేడు స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

ప్రస్తుతం గ్రాము బంగారం ధర
ఈ వార్తలతో పాటు గత వారం విడుదలైన బలమైన అమెరికా ఉద్యోగాల డేటా వలన ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలను తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సుంకాల ప్రభావం ఉంటుంది కాబట్టి, ఫెడ్ జూలైలో రేట్లు తగ్గించకుండా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లు కూడా ఇప్పుడు సంవత్సరాంతానికి గరిష్ఠంగా రెండు తక్కువ వడ్డీ రేట్ల కోతలే ఉంటాయని భావిస్తున్నాయి. ఇక డాలర్ రేటు స్థిరంగా ఉండటంతో బంగారంపై ప్రభావం చూపింది.
జూలై 9 తేదీ బుధవారం బంగారం ధరలను పరిశీలిస్తే..భారతదేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 66 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,818 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.60 పెరిగి 9,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 49 పెరిగి రూ.7,364 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,640 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,640 గా నమోదైంది.
చెన్నైలో బంగారం ధరలు
చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,250 గా నమోదైంది.
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,640 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,330 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,150 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,760 నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,000 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,640 గా నమోదైంది .

బంగారాన్ని మొదట ఎవరు తయారు చేశారు?
ప్రపంచంలో మొదట బంగారాన్ని ఎవరు కనుగొన్నారు?
– Acre Gold Now
జోసిమోస్ అనే ఈజిప్షియన్ రసవాది స్వచ్ఛమైన బంగారాన్ని మొదటిసారిగా కనుగొన్నాడు (కొలంబస్ అమెరికాకు చేరుకోవడానికి 24 శతాబ్దాల ముందు). బంగారం ఆవిష్కరణ పురాతన ఈజిప్షియన్లకు ఆపాదించబడింది, వారు బంగారంతో ఆభరణాలను తయారు చేశారు.
బంగారానికి ఆ పేరు ఎవరు పెట్టారు?
బంగారానికి ఆ పేరు ఎలా వచ్చింది? | గార్ఫీల్డ్ రిఫైనింగ్

“బంగారం” అనే పదం పాత ఇంగ్లీష్ మరియు జర్మనీ మూలాల నుండి ఉద్భవించింది. జర్మన్ గోతిక్ భాష బంగారాన్ని “గుల్యుఎ” అని వ్యక్తపరిచింది, తరువాత ఇది పాత ఆంగ్లంలో “జియోలు”గా పరిణామం చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: RCB: ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఆర్సీబీకి అగ్రస్థానం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870