Gold prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

Read Time:  1 min
Gold price today
Gold price today
FONT SIZE
GET APP

బంగారం, వెండి ధరలు (Gold prices) భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది.

Read Also: Jio Star: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్..

Gold prices: భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు (Gold prices) రికార్డు స్థాయికి చేరాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.51 లక్షలు, వెండి ధర కిలో రూ.4 లక్షల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరగగా డాలర్ విలువ నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

హైదరాబాద్‌లో (Hyderabad) కిలో వెండి రూ.3.75 లక్షలుగా ఉంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.26,821 పెరిగి రూ.3.83 లక్షలకు పలికి రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం రూ.1.62 లక్షలకు పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.