📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Gold Prices update: రూ. 15 వేలకు పైగా తగ్గిన బంగారం ధర

Author Icon By Vanipushpa
Updated: June 25, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు రూ. 15,300కు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటించడంతో బంగారం ధరలు నేల చూపులు చూశాయి. కాగా పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ వదిలేసి యూస్ డాలర్ మీద ఇప్పుడు దృష్టి సారించారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయతే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ వార్ మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
కయ్యానికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించిందని దానికి గట్టిగా బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది.దీనికి ఇరాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇజ్రాయెల్‌ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కయ్యానికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు తమ ద‌ృష్టిని కేంద్రీకరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు బంగారం సురక్షితం అనే డిమాండ్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. జూన్ 23 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తర్వాత బంగారంతో పాటు ముడిచమురు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవి కూడా మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం స్వచ్ఛమైన పెట్టుబడి-గ్రేడ్ బంగారం అయిన 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.9,895 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 9,070 వద్ద ట్రేడ్ అవుతుండగా 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ. 7,421 వద్ద ట్రేడ్ అవుతోంది.

రూ. 15 వేలకు పైగా తగ్గిన బంగారం ధర


బుధవారం బంగారం ధరలు
జూన్ 25వ తేదీ బుధవారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర​రూ.98,950 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 వద్ద ట్రేడ్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గడం లేదా పెరగడం అనే దానిపై పశ్చిమాసియా ఉద్రిక్తతలు మీద ఆధారపడి ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో నేడు ధరలు
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. విజయవాడ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,750 గా నమోదైంది.

ఇతర నగరాలలో..
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,950 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.90,700 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,210 గా నమోదైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,210 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,850 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,340 నమోదైంది. ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,750 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,250 నమోదైంది.

Read Also: Stock market: యుద్ధ భయాలు ఉన్నా లాభాల్లోనే సూచీలు

#telugu News 15000 Ap News in Telugu Breaking News in Telugu by drops gold Google News in Telugu Latest News in Telugu over Paper Telugu News Price rs Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.