📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Gensol: జెన్సోల్ ఫౌండర్ సహా ప్రమోటర్ అరెస్టు

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జెన్సోల్ ఇంజనీరింగ్ పరిసర ప్రాంతాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాడులు నిర్వహించింది, ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు పునీత్ సింగ్ జగ్గీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. అయితే ఈ కంపెనీ గతంలో ఎలక్ట్రిక్ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్‌కు క్యాబ్ సేవలను అందించేది, కానీ దానిని కొద్దిరోజుల క్రితం నిలిపివేయబడింది. పెట్టుబడిదారుల డబ్బును వ్యక్తిగత ఉపయోగం కోసం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఈ కంపెనీపై ఉన్నాయి.

అసలు విషయం ఏంటి
నిజానికి జెన్సోల్ ఇంజనీరింగ్ బ్లూస్మార్ట్ కంపెనీకి ఎలక్ట్రిక్
వాహనాలను అందిస్తుంది, ఇందుకు కంపెనీ ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ IREDA లిమిటెడ్ నుండి లోన్ తీసుకుంది. జెన్సోల్ లోన్ మొత్తం నుండి దాదాపు 6,500 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తామని హామీ ఇచ్చింది, కానీ కంపెనీ అలా చేయలేదు ఇంకా అందులో నుండి దాదాపు రూ.265 కోట్లను దుర్వినియోగం చేసింది.
కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి అండ్ పునీత్ సింగ్ జగ్గి పెట్టుబడిదారుల డబ్బును ఇతర కంపెనీలలోకి మళ్లించారు. ఈ డబ్బుతో వీరు ఇల్లు కొనడం, ఇంకా కొంత డబ్బును తన తల్లి అకౌంట్లో జమ చేయడంతో పాటు, వ్యక్తిగత ప్రయాణాలకి రూ.3 లక్షలు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కోసం రూ.95 వేలు చెల్లిచడం కూడా కంపెనీ నిధుల నుండి జరిగింది.
సెబీ నిర్ణయం
జెన్సోల్ పెట్టుబడిదారుల డబ్బును దుర్వినియోగం చేసిందని సెబీ ఆరోపించింది. అలాగే, రెగ్యూలేటరీ సంస్థ కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ ఇంకా పునీత్ సింగ్ జగ్గీలను స్టాక్ మార్కెట్ నుండి నిషేధించింది, ఈ దెబ్బ కంపెనీ షేర్లపై కూడా ప్రభావం చూపింది అలాగే జెన్సోల్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ విషయంపై ED దర్యాప్తు చేస్తోంది అండ్ కంపెనీ ప్రమోటర్ పునీత్‌ సింగ్ జగ్గీలను అదుపులోకి తీసుకుంది. నివేదికల ప్రకారం, అన్మోల్ సింగ్ జగ్గీ దుబాయ్‌లో ఉన్నాడు.
ప్రభుత్వ సంస్థలు IREDA అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) నుండి తీసుకున్న టర్మ్ లోన్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కూడా జెన్సోల్ పై ఉన్నాయి. సెబీ ప్రకారం కంపెనీ మొత్తం రూ.977.75 కోట్ల రుణం తీసుకుంది, అందులో రూ.663.89 కోట్లు ప్రత్యేకంగా 6,400 ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) కొనుగోలు చేయడానికి కేటాయించారు.

అన్ని తప్పుడు లేఖలు

ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి, సంబంధిత పార్టీ అయిన బ్లూస్మార్ట్‌కు లీజుకు ఇచ్చారు. అయితే, ఫిబ్రవరిలో సెబీకి ఇచ్చిన సమాధానంలో జెన్సోల్ ఇప్పటివరకు 4,704 ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనుగోలు చేసినట్లు అంగీకరించింది. అయితే మొత్తంగా చూస్తే 6,400 ఎలక్ట్రిక్ వాహనాలకు నిధులు వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల సప్లయర్ గో-ఆటో కూడా మొత్తం రూ.567.73 కోట్లకు 4,704 యూనిట్లను డెలివరీ చేసినట్లు ధృవీకరించింది. జెన్సోల్ అదనంగా 20% ఈక్విటీ సహకారాన్ని కూడా చెల్లించాల్సి ఉంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కోసం మొత్తం ఖర్చు దాదాపు రూ.829.86 కోట్లు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రూ.262.13 కోట్ల లెక్కలు తేలాల్సి ఉంది. మీడియా నివేదికల ప్రకారం, మహేంద్ర సింగ్ ధోని, దీపికా పదుకొనే, అష్నీర్ గ్రోవర్ సహా సంజీవ్ బజాజ్ వంటి చాల మంది పెద్ద పేర్లు కూడా బ్లూస్మార్ట్‌లో పెట్టుబడులు పెట్టాయి.

Read Also: Jammu and Kashmir : నేడు ఉగ్రదాడి ఘటన వద్దకు రాహుల్ గాంధీ

#telugu News and promoter arrested Ap News in Telugu Breaking News in Telugu Gensol founder Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.