Fuel Prices: ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

Read Time:  1 min
Fuel Prices
Fuel Prices
FONT SIZE
GET APP

త్వరలో ఇంధన ధరలు(Fuel Prices) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందుగానే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం(Central Govt)పరిశీలన చేస్తోందని సమాచారం. లీటర్‌కు రూ.3 నుంచి రూ.4 వరకు భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ తన తాజా నివేదికలో పేర్కొంది.

Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

Fuel Prices: Another burden on the people? Petrol prices to increase soon
Fuel Prices: Another burden on the people? Petrol prices to increase soon

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రస్తుతం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో బడ్జెట్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంధన ధరల(Diesel Prices) పెంపు అమలైతే రవాణా ఖర్చులు పెరిగే అవకాశముండటంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం అవసరమని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.