📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Petrol Pump: పెట్రోల్​ బంకుల్లో ఈ సౌకర్యాలన్నీ ఉచితమే

Author Icon By Vanipushpa
Updated: May 16, 2025 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా తమ వాహనాల్లో పెట్రోల్, డిజీల్ (Petrol, Diesel) అయిపోయినప్పుడ ప్రజలు పెట్రోల్​ పంపు​లకు వెళతారు. అయితే పెట్రోల్ పంపు(Petrol Pumps) ల్లో కస్టమర్లతో పాటు సామాన్యులు కూడా అనేక సౌకర్యాలు ఫ్రీగా పొందొచ్చని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. పెట్రోల్ పంప్​ ఆపరేటర్​ సామాన్యులకు కొన్ని సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ఉల్లంఘిస్తే వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పెట్రోల్ పంపుల్లో ఉచిత సౌర్యాల గురించి ను ఉత్తర్​ప్రదేశ్​ ఫరూఖాబాద్​ జిల్లా అధికారి సురేంద్ర యాదవ్ వెల్లడించారు. అవేంటో తెలుసుకుందామా!
సౌకర్యాలు లోపిస్తే 45రోజులు పెట్రోల్ బంక్​ క్లోజ్
ఫరూఖాబాద్​ జిల్లాలో 85 పెట్రోల్ పంపులు ఉన్నట్లు సురేంద్ర యాదవ్ చెప్పారు. పెట్రోల్, సీఎన్​జీ పంపుల వద్ద టాయిలెట్లు, త్రాగునీరు, టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని, దానిపై పెంట్రోల్ పంపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వినియోగదారులకు ఈ సౌకర్యాలు కల్పించకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు. మూడుసార్లు అవకతవకలు లేదా లోపాలు కనిపిస్తే, పెట్రోల్ పంప్ సరఫరా, అమ్మకాలను 45 రోజుల పాటు నిలిపివేస్తామని సురేంద్ర యాదవ్ వెల్లడించారు. జిల్లా అధికారి సురేంద్ర యాదవ్​ ప్రకారం పెట్రోల్​ పంపుల్లో ఉచిత సేవలు ఇవే.
పెట్రోల్​ పంపుల్లో ఇవ్వన్నీ ఫ్రీ!
దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్​, భారత్​ పెట్రోలియం వంటి సంస్థల పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలన్నీ ఉచితకంగా పొందుచ్చు. పెట్రోల్ పంపులో మీ వాహన టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్రోల్ పంపుల వద్ద మీకు ఉచితంగా తాగునీరు దొరుకుతుంది. ఇక్కడ RO లేదా వాటర్ కూలర్ సౌకర్యాన్ని అందించడం అవసరం. దీంతో మీరు సులభంగా నీరు త్రాగవచ్చు. పెట్రోల్ పంపుల వద్ద బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉచితం. మీరు దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఎవరైనా నిరాకరిస్తే షిఫ్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
అత్యవసర సమయంలో మీరు పెట్రోల్ పంప్ నుంచి ఉచిత కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ సౌకర్యాన్ని పంపు యజమాని అందిస్తాడు. పెట్రోల్ పంపులో ప్రథమ చికిత్స పెట్టె సౌకర్యం కూడా ఉంది. ఇందులో ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉంటాయి, వీటిని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. అయితే, మందులు ఉపయోగించే ముందు, గడువు తేదీ నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం.
పెట్రోల్ పంపులో ఇంధనం నింపేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే, అగ్ని భద్రతా పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఉపయోగించవచ్చు. దీనికి కూడా ఎటువంటి రుసుములు ఉండవు.
పెట్రోల్ పంపులో యజమాని పేరు, కంపెనీ పేరు, కాంటాక్ట్ నంబర్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా అవసరం వస్తే పంపును సంప్రదించడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది.
పెట్రోల్ బంకులు ఇలా మెయింటేన్ చేయాలి!
అన్ని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ పంపుల వద్ద పురుషులు, మహిళలు, వికలాంగులకు ప్రత్యేక శుభ్రమైన మరుగుదొడ్లు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సురేంద్ర యాదవ్ తెలిపారు. సాధారణ ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించడానికి టాయిలెట్లకు తాళాలు ఉండకూడదన్నారు. పెట్రోలియం కంపెనీలు సాధారణ ప్రజల నుంచి టాయిలెట్ శుభ్రతపై అభిప్రాయాన్ని తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు జిల్లాలోని పెట్రోల్ పంపులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, 1981లో అమల్లోకి వచ్చిన పెట్రోలియం చట్టంలో వివరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని 2002లో సవరించారు.

Read Also: Donald Trump: గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు: ట్రంప్

#telugu News All these facilities Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Petrol stations Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.