అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump)- టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి రాకముందు ఆప్తమిత్రులుగా ఉన్న ఇద్దరూ ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అయితే ఈ వార్ లో ఎలాన్ మస్క్ తన సంపదను భారీగా కోల్పోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఎలోన్ మస్క్ సగటున రోజుకు 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు .
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం
జనవరి 17 నుండి టెస్లా CEO మొత్తం 113 బిలియన్ డాలర్లు లేదా అతని వ్యక్తిగత సంపదలో 25 శాతాన్ని కోల్పోయాడు. వీరిద్దరి మద్య కొట్లాటకు కారణం ఏంటంటే.. ట్రంప్ కేబినెట్ ఇటీవల ఖర్చు బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును నాకు తెలియకుండా ఎలా ఆమోదిస్తారని ఎలాన్ మస్క్ అడగంతో గొడవ స్టార్ట్ అయింది. ఈ బిల్లు దేశ రుణాన్ని రూ. 200 లక్షల కోట్లకు పెంచుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేను ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఖర్చులతో పాటు పన్నులను తగ్గించే బిల్లు మీద మాట మాత్రమైనా చెప్పలేదని ఎలాన్ మస్క్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.
అంతరిక్ష నౌకను నిలిపివేస్తా:మస్క్
జూన్ 5న మొదలైన ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత..అధ్యక్షుడు ట్రంప్ ఎలోన్ మస్క్ తో తన స్నేహ సంబంధం ముగిసిపోయిందని, అధ్యక్ష పదవి గౌరవాన్ని అగౌరవపరిచారని సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఈ వివాదం తర్వాత ట్రంప్ తీసుకున్న ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేస్తామని, స్పేస్‌ఎక్స్ యొక్క డ్రాగన్ అంతరిక్ష నౌకను నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ అకస్మాత్తుగా ప్రకటించాడు.అయితే ఆ తరువాత ఏమైందో ఏమో అతను తన మనసు మార్చుకుని అంతరిక్ష నౌక పనిచేస్తూనే ఉంటుందని చెప్పాడు. ఆ తరువాత జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని..ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని మస్క్ అన్నారు. ఎప్స్టీన్ బాల వ్యభిచారానికి పాల్పడగా జైలు శిక్ష వేస్తే జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.అయితే ఎక్స్ లో చేసిన ఈ ఆరోపణల పోస్టును తరువాత డిలీట్ చేశారు.
దెబ్బతింటున్న టెస్లాషేర్లు
ఈ యుద్ధ సునామి టెస్లా షేర్లను తాకింది. జూన్ 5న కంపెనీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ఏకంగా టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 152 బిలియన్ డాలర్లకు కుప్పకూలింది. దీంతో టెస్లా వాటాదారులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. కంపెనీకి తగిన సమయం కేటాయించకపోవడం వల్ల టెస్లాషేర్లు దెబ్బతింటున్నాయి. ఈ సంవత్సరం జనవరి 21న టెస్లా వాటా 424 డాలర్లు ఉండగా, ఇప్పుడు అది 295 డాలర్లకి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే టెస్లా వాటాదారులు కంపెనీపై శ్రద్ధ చూపాలని పట్టుబట్టారు. దీంతో మస్క్ కంపెనీ మీద ఫోకస్ పెట్టడానికి ట్రంప్ నుండి దూరం జరుగుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 29, 2025న న్యూస్ సంస్థ @JDVanceNewsX Xలోఒక పోస్ట్ షేర్ చేసింది.. “అమెరికా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఎలోన్ మస్క్ తన సంపదలో 25 శాతం (సుమారు $113 బిలియన్లు) కోల్పోయాడు” అని అందులో పేర్కొంది. అయితే ఆ పోస్ట్ కు మస్క్ “విలువైనది” అంటూ రిప్లై ఇచ్చాడు.
Read Also: Trump vs Musk : ట్రంప్ వ్యాఖ్యలకు చింతిస్తున్నా – మస్క్