దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య కూడా మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. దీంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 159 పాయింట్ల లాభంతో 81,345 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 43 పాయింట్ల లాభంతో 24,727 వద్ద ఉన్నాయి.

సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, బజాజ్‌ఫిన్‌సర్వ్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 66.39 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,307 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.ఇక మార్కెట్‌కు బలమైన ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కొనుగోళ్లు ఇస్తున్న దన్నుతో సూచీలు పాజిటివ్ జోన్‌లో ఉన్నాయి. తదుపరి సెషన్లలో మార్కెట్ దిశపై ఎక్కువగా అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపవచ్చు.
అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500.. 0.39 శాతం, డోజోన్స్ 0.27 శాతం, నాస్‌డాక్ 0.38 శాతం మేర నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.69 శాతం, షాంఘై 0.38 శాతం, హాంగ్‌సెంగ్ 0.70 శాతం లాభంతో కదలాడుతున్నాయి. ఇక జపాన్ నిక్కీ మాత్రం 0.10 శాతం నష్టంతో కదలాడుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.10,016 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,738 కోట్ల షేర్లును కొనుగోలు చేశారు.
Read Also: Smart Phones : ఎగుమతులతో ఇతర దేశాల మతిపోగొడుతున్న భారత్..