చైనా పై అమెరికా తాజాగా మరోసారి సుంకాన్ని పెంచుతు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే పరస్పర సుంకాల 90 రోజుల బ్రేక్ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ నేడు ఊపందుకుంది. దింతో ట్రేడింగ్ ప్రారంభంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పెరిగింది, నిఫ్టీ కూడా 22,750 మార్కును దాటింది. సన్ ఫార్మా, టాటా మోటార్స్ 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం 9.55 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 1416.09 పాయింట్లు అంటే 1.92% పెరిగి 75,263.24 వద్ద ట్రేడవుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 456.80 పాయింట్లు అంటే 2.04% పెరిగి 22,855.95 పాయింట్లకు చేరుకుంది. ఈ పెంపుతో BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6.97 లక్షల కోట్లు పెరిగి రూ.400.79 లక్షల కోట్లకు చేరుకుంది.
నేడు పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా తప్ప మిగతా దేశాలన్నింటికీ 90 రోజుల పాటు పరస్పర సుంకాలను నిషేధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు . అలాగే చైనాపై పరస్పర సుంకాన్ని 145 శాతానికి పెంచారు. మహావీర్ జయంతి కారణంగా నిన్న గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మూతపడింది. దింతో షేర్ మార్కెట్ ఇవాళ పరుగులు పెడుతుంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 27 లాభాలతో ప్రారంభం కాగా, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్స్ పెరిగాయి. మరోవైపు, ఆసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టిసిఎస్ షేర్స్ క్షీణించాయి.
టీసీఎస్ షేర్లు పతనం
దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ షేర్లు ఇవాళ స్వల్ప క్షీణతతో ట్రేడవుతున్నాయి. 2025 ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికంలో కంపెనీ లాభం 1.7% తగ్గి రూ.12,224 కోట్లకు చేరుకుంది. ఈ లాభం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ. విశ్లేషకులు దీనిని రూ.12,650 కోట్లుగా అంచనా వేశారు. మరోవైపు నిఫ్టీ ఫార్మా, మెటల్ సూచీలు 3% కంటే ఎక్కువ లాభపడ్డాయి. అదేవిధంగా నిఫ్టీ ఆటో, హెల్త్‌కేర్ 2% కంటే ఎక్కువ ఎగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, పీఎస్ యూ బ్యాంక్, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 1 నుండి 2% మధ్య లాభపడ్డాయి.
ఈ వారంలోని చివరి ట్రేడింగ్ రోజున చూస్తే ఇతర ఆసియా మార్కెట్లు క్షీణించాయి. 90 రోజుల సుంక విరామం, అమెరికా నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ శక్తివంతంగా పుంజుకుంది. ఇది పెట్టుబడిదారులకు, ట్రేడర్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. జపాన్ నిక్కీ సూచీ 4.5% తగ్గింది. దక్షిణ కొరియా మార్కెట్ 1.7% నష్టపోయింది. భారత మార్కెట్ మాత్రం వ్యతిరేక దిశలో పరుగులు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై సుంకాలను 145%కి పెంచారు. అయితే, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల సుంక మినహాయింపు ప్రకటించారు. దీని ప్రభావంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది, మార్కెట్ జోరందుకుంది.
READ ALSO: Darshan: దర్శన్ తీరుపై కోర్ట్ ఆగ్రహం