📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

LPG Gas: రేపటి నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ఇతర నిబంధనల్లో మార్పులు

Author Icon By Vanipushpa
Updated: April 30, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏప్రిల్ నెల ముగిసి రేపటి నుండి మే నెల స్టార్ట్ అవబోతుంది. అయితే ఎప్పటిలాగే ప్రతినెల మారే ముందు కొన్ని నిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అయితే ఈసారి కూడా పెట్రోల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ గ్యాస్ ధరల విషయంలో మార్పులు జరగబోతున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాక గ్యాస్ సిలిండర్ల ధరల నుంచి బ్యాంకింగ్ సేవల వరకు చాలా విషయాల్లో మార్పులు ఉండొచ్చు. మరి మే నెలలో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే మార్పులు ఏంటో తెలుసా…
LPG గ్యాస్ ధరల్లో మార్పులు
ప్రతి నెలా ప్రారంభానికి ముందు ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఎల్‌పిజి గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. తరువాత వంటింటి గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మారవచ్చు. దింతో మే నెల 1వ తేదీన గ్యాస్ ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉంటుంది. మరోవైపు ఏప్రిల్‌లో వాణిజ్య సిలిండర్ ధరలను 50 రూపాయలు పెంచారు.

భారతీయ రైల్వేలో మార్పులు
భారతీయ రైల్వే టికెట్ బుకింగ్‌కు సంబంధించి కూడా మార్పులు రానున్నాయి. అంటే మే నెల నుండి రైల్వే ప్రయాణీకుల టిక్కెట్లకు సంబంధించిన మార్పులు ఉంటాయి. దింతి వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్ ఇంకా ఏసీ కోచ్‌లలో ప్రయాణించలేరు. ATM విత్ డాలో మార్పు: ఆర్‌బిఐ ఇంకా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మే 1 నుండి కస్టమర్లు ఎటిఎంల నుండి డబ్బు విత్ డ్రా చేస్తే అధికంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో 3 సార్లు వరకు విత్ డ్రా చేసుకోవచ్చు, కానీ ఇప్పటివరకు 3 సార్లకు మించి విత్ డ్రా చేస్తే కస్టమర్ బ్యాంకు అకౌంట్ నుండి రూ. 21 ఛార్జీ విధించేది. కానీ ఇక నుండి రూ.23కి పెంచనున్నారు. మీరు ATM నుండి 3 సార్లు కంటే ఎక్కువగా డబ్బు తీసుకుంటే మీకు రూ.23 వరకు ఛార్జ్ చేయబడుతుంది, అది కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్’గా కట్ అవుతుంది.
FD అండ్ సేవింగ్స్ అకౌంట్లో..
మీకు FD లేదా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మే 1 నుండి లోన్స్ సంబంధించిన మార్పులు ఉండవచ్చు. RBI రెపో రేటును వరుసగా రెండుసార్లు తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. దింతో FD లేదా సేవింగ్స్ అకౌంట్ నుండి తీసుకున్న లోన్ల పై వడ్డీ రేటు మారవచ్చు. చాల బ్యాంకులు ఇప్పటికే లోన్ వడ్డీ రేట్లను మార్చాయి.
గ్రామీణ బ్యాంకుల్లో కూడా మార్పులు
మరోవైపు గ్రామీణ బ్యాంకులలో కూడా ఈ మార్పులు చూడవచ్చు. రాష్ట్రంలోని అన్ని స్థానిక బ్యాంకులను కలిపి ఆర్‌బిఐ ఒక పెద్ద బ్యాంకును ఏర్పాటు చేస్తుంది. వివిధ గ్రామీణ బ్యాంకులను ఒకే పెద్ద బ్యాంకుగా మార్చే ప్లాన్ ఉంది. దింతో దేశంలోని 11 రాష్ట్రాల్లో గ్రామీణ బ్యాంకును పెద్ద బ్యాంకుగా తీర్చిదిద్దుతారు. సామాన్యుల పై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే : మే 1 నుండి వంటింటి గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ప్రజలపై సిలిండర్ భారం పడుతుంది ఇంకా ఖర్చులు పెరుగుతాయి. ఏప్రిల్ నెలలో వంటింటి సిలిండర్ ధర రూ.50 పెరిగింది. రెపో రేటు పెరుగుదల కారణంగా, రుణం తీసుకునేవారికి వడ్డీ రేటులో మార్పు ఉండవచ్చు. మీరు ATM నుండి మూడు సార్ల కంటే ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి రావచ్చు.

Read Also: Lavanya Tripathi : పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భారత మహిళ పై లావణ్య త్రిపాఠీ ఫైర్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Changes in LPG gas from tomorrow Google News in Telugu Latest News in Telugu other regulations Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.