సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది . ఈ మెసేజ్ ఏంటంటే ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టె ముందు ‘CANCEL’ బటన్‌ను రెండుసార్లు నొక్కితే, మీ పిన్ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందించిందని కూడా మెసేజులో ఉంది. ఆ మెసేజ్ ప్రకారం, ఇలా చేయడం వల్ల ATM మెషీన్ కీప్యాడ్ ట్యాంపరింగ్‌ను నిరోధించవచ్చు.
దయచేసి దీన్ని మీ అన్ని ట్రాన్సక్షన్స్ లో అలవాటు చేసుకోండి.
ఇంకా ఈ మెసేజులో ‘ATM నుండి డబ్బు తీసుకునేటప్పుడు చాలా ఉపయోగకరమైన చిట్కా’ అంటూ కార్డు పెట్టె ముందు క్యాన్సల్ బటన్‌ను రెండుసార్లు నొక్కండి. ఎవరైనా మీ పిన్ దొంగిలించడానికి కీప్యాడ్ సెట్ చేసి ఉంటే అది క్యాన్సల్ అవుతుంది. దయచేసి దీన్ని మీ అన్ని ట్రాన్సక్షన్స్’లో అలవాటు చేసుకోండి.’ అని ఉంది.
ఇందులో నిజం ఎంతంటే
ఈ వార్త పూర్తిగా తప్పు. ఈ మెసేజ్ నకిలీదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. రిజర్వ్ దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్ జారీ చేయలేదు. CANCEL బటన్ రెండుసార్లు నొక్కితే పిన్ దొంగతనాన్ని నిరోధించవచ్చని అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి సూచన చేయలేదు. PIB ఫ్యాక్ట్ చెక్ అనేది భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ హ్యాండిల్. మీ ATM కార్డును సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్: అన్ని ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలని RBI కస్టమర్లకు సలహా ఇస్తుంది. *మీ ATM పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకండి. అది మీకు ఎంత సన్నిహితులైనా సరే. *మీ ATM పిన్‌ను ఎంటర్ చేసేటప్పుడు ఎవరూ చూడకుండా కీప్యాడ్ కప్పి ఉంచండి. *కొత్త ప్రదేశాలు లేదా అనుమానాస్పద ప్రదేశాలలో ATMల నుండి ట్రాన్సక్షన్స్ చేయడం మానేయండి. *ATM కార్డుతో ట్రాన్సక్షన్ చేసేటప్పుడు స్టాల్ అండ్ కీప్యాడ్ చెక్ చేయండి. ఎందుకంటే మోసగాళ్ళు స్కిమ్మింగ్ డివైజెస్ ఉపయోగించి మోసం చేస్తారు.
SMS లేదా అలర్ట్స్ చెక్ చేస్తూ ఉండండి
*మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన SMS లేదా అలర్ట్స్ చెక్ చేస్తూ ఉండండి, ఇలా అన్ని రకాల ట్రాన్సక్షన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఏదైనా తెలియని ట్రాన్సక్షన్ గురించి మీకు తెలిసిన వెంటనే మీరు మీ బ్యాంకుకు తెలియజేయాలి . *RBI లేదా బ్యాంక్ పేరుతో వచ్చే ఏదైనా కాల్స్ లేదా మెసేజులో మీ ATM పిన్ లేదా ఏదైనా ఇతర సమాచారాన్ని చెప్పకండి. *మీ ATM పాస్‌వర్డ్‌ను క్రమం తప్పకుండా మార్చండి. *సోషల్ మీడియాలో నకిలీ వార్తలను నివారించండి. *ATMలలో కార్డ్ క్లోనింగ్‌ను నిరోధించడానికి EMV చిప్ కార్డులను ఉపయోగించండి. ఏదైనా అనుమానం వస్తే వస్తే బ్యాంకు హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. *ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ కోసం టు-స్టెప్స్ అతేంటికేషన్ ఉపయోగించండి.
అప్రమత్తంగా ఉండండి: ఏటీఎం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ తప్పుడు సమాచారాన్ని నమ్మడం ప్రమాదకరం. కాబట్టి, సరైన సమాచారం కోసం ఎప్పుడైనా అఫీషియల్ అకౌంట్స్ లేదా పేజీని చెక్ చేయండి . ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు చాలా పెరుగుతున్నాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.
Read Also: Ishaq Dar: భారత్ ఇక్కడ ఆగిపోతే మేము కూడా ఆగిపోతాం: పాక్ విదేశాంగ శాఖ మంత్రి