📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India’s Wealth: వన్ వెల్త్ నివేదికలో అగ్రస్థానంలో అంబానీ కుటుంబమే

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో అత్యంత ధనవంతులుగా అంబానీ కుటుంబం(Ambani Family) నిలిచింది. అంబానీ కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ(Akash, Ananth Ambani)లు ఒక్కొక్కరు రూ. 3.6 లక్షల కోట్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత ధనవంతులుగా నిలిచారు. క్రిసిల్ సహకారంతో దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను 360 వన్ వెల్త్(One Wealth) తయారు చేసింది. ఈ జాబితాలో అంబానీ కుటుంబమే అగ్రస్థానంలో నిలిచింది మన దేశంలో..

India’s Wealth: వన్ వెల్త్ నివేదికలో అగ్రస్థానంలో అంబానీ కుటుంబమే


భారతదేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు
ఈ నివేదికలో 2,013 మంది భారతీయ సంపద సృష్టికర్తల గురించి వివరించారు.. వీరి మొత్తం నికర విలువ సుమారు రూ.100 ట్రిలియన్లుగా ఉంది, ఇది దేశ GDPలో దాదాపు మూడో వంతుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నివేదిక కనీసం రూ.5 బిలియన్ల నికర విలువ కలిగిన ధనవంతులను పరిగణలోకి తీసుకుంది. వీరిలో వ్యవస్థాపకులు, నిపుణులు, పెట్టుబడిదారులు, టాప్ కంపెనీల వారసులు ఉన్నారు. వీరి సగటు నికర విలువ రూ.14.2 బిలియన్లు. ట్రాక్ చేయబడిన సంపదలో భారతదేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 59% వాటా కలిగి ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రమే 12% నియంత్రణలో ఉన్నాయి.
రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ధనవంతులు
ఈ అధ్యయనం ప్రకారం.. సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ధనవంతులు ఉన్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని వెల్త్ నివేదిక తెలిపింది. దేశంలో 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి ఆస్తులను కలిగి ఉండగా.. 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ తాజా అధ్యయనం తెలిపింది. దేశంలోని తిరుగులేని ఆర్థిక కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై అవతరించింది. ముంబైలో దేశంలోనే మొత్తం సంపదలో 40% వాటాను కలిగి ఉంది. ఆర్థిక రాజధానిలో 577 మంది సంపద సృష్టికర్తలు ఉన్నారు. ముంబై తర్వాత న్యూఢిల్లీ, బెంగళూరు వరుసగా 17%, 8% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వెల్త్ నివేదిక ప్రకారం..
బ్యాంకింగ్, టెలికాం, విమానయాన రంగాలు సగటు వ్యక్తిగత సంపదలో అగ్రస్థానంలో ఉన్నాయి, ఇవి రూ. 7,900 కోట్ల నుండి రూ. 8,500 కోట్ల వరకు ఉన్నాయి. సంపన్న వ్యక్తుల సంఖ్యలో ఫార్మాస్యూటికల్స్ ముందంజలో ఉంది. దీని తరువాత ఆర్థిక పరమై సేవలు, ఐటీ రంగం ఉన్నాయి. భారతదేశ సంపదలో మహిళలు 24% అత్యంత సంపదను కలిగి ఉన్నారు. ఫార్మాలో దాదాపు 33%, ఆర్థిక సేవలలో దాదాపు 24% బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహిళలు. ఈ జాబితాలో ఇషా అంబానీ అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచింది. వ్యాపారాలను స్థాపించిన లేదా రాబడిని పెంచడంలో కీలక పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది.

Read Also: PM Modi: ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

#telugu News Ambani family Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today tops One Wealth report

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.