ప్రస్తుత డిజిటల్ యుగం(Digital Period)లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)(UPI) వినియోగం పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్(Smart Phone) కలిగిన ప్రతి ఒక్కరూ యూపీఐ వినియోగిస్తున్నారు. ఈ విధానం అటు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికం అయింది. ఈ విధానంతో నగదు బదిలీ చాలా తేలికగా మారిపోయింది. అయితే జులై 16 న యూపీఐ, ఏటీఎమ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో నగదు లావాదేవీలకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వినియోగిస్తున్నారు. సిటీలో ప్రజల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వరకు అందరూ దీనిని ఉపయోగిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా..
ఫిన్ టెక్(Fin Tech) సంస్థల కృషితో పాటు కేంద్ర ప్రభుత్వ(Central Govt) ప్రోత్సాహం కారణంగా నగదు బదిలీ తేలికగా మారిపోయింది. ఒక్క రూపాయి దగ్గర్నుంచి వేల వరకూ ప్రజలు భౌతిక కరెన్సీ కంటే యూపీఐ చెల్లింపులకే మెుగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భారత్ లోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది.
ఏటీఎమ్ ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన
తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జులై 16న బుధవారం రోజున ఎస్బీఐ కు సంబంధించి ఫోన్ పే, గూగుల్ పే, ఏటీఎమ్ ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా యూపీఐ, ఏటీఎమ్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా.. యూపీఐ, ఐఎమ్పీఎస్, యోనో, ఆర్ఐఎన్ బీ, ఏటీఎమ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను అర్ధరాత్రి 1:05 ఏమ్ నుంచి 2:10 ఏఎమ్ వరకు దాదాపు 65 నిమిషాల వరకు ఏటీఎమ్, యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది .
ఆన్‌లైన్ చెల్లింపు అంటే ఏమిటి?
ఆన్‌లైన్ చెల్లింపులు అంటే ఏమిటి? ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవల కోసం ఇంటర్నెట్ ద్వారా ప్రారంభించబడే చెల్లింపులను ఆన్‌లైన్ చెల్లింపులు అంటారు.
UPI యొక్క పూర్తి రూపం ఏమిటి?
UPI యొక్క పూర్తి రూపం | చరిత్ర, ప్రాముఖ్యత, పని విధానం, ప్రయోజనాలు
UPI యొక్క పూర్తి రూపం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన రియల్-టైమ్ పేమెంట్ సిస్టమ్
Read hindi news: hindi.vaartha.com
Read also: Odisha: ప్రొఫెసర్ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. ఖండించిన ప్రతిపక్షాలు