📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

AI: వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. కృత్రిమ మేధ సాయంతో గర్భం దాల్చిన మహిళ

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

18 ఏళ్ల కలను నెరవేర్చిన కృత్రిమ మేధ

నేడు ప్రపంచం మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం విస్తృతంగా విస్తరిస్తోంది. సాధారణ పనులనుంచి మొదలుకుని, అత్యాధునిక పరిశోధనల దాకా ఈ టెక్నాలజీ అనేక రంగాల్లో వినియోగించబడుతోంది. ఉద్యోగాలపై ఆందోళనలు ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఓ వైద్య విజయం నిలుస్తుంది. సుమారు 18 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఓ జంట కలను ఏఐ సాకారం చేసింది. ఏఐ సాయంతో మహిళ గర్భం దాల్చింది. అజూస్పర్మియా (Azoospermia) అనే సమస్యతో బాధపడుతున్న భర్త వీర్యం నుండి, ఏఐ టెక్నాలజీతో ఒక వీర్యకణాన్ని గుర్తించి, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా భార్య గర్భం దాల్చింది. ఈ సంఘటన వైద్య చరిత్రలో ఒక సంచలనంగా మారింది.పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు చాలా బాధపడ్డారు. అయితే సదరు మహిళ భర్తకు అజూస్పర్మియా అనే సమస్య ఉంది.

ఐవీఎఫ్ పద్ధతితో విజయవంతమైన గర్భధారణ

అంటే అతని వీర్యంలో వీర్యకణాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిని పరీక్షల్లో గుర్తించడం కూడా కష్టం అని వైద్యులు కూడా తెలిపారు. దీంతో ఆ దంపతులు ఐవీఎఫ్ (IVF) ద్వారా పిల్లలను కనాలని చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. సంతానం కోసం చాలా దేశాలలోని డాక్టర్లను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న సమయంలో, వారు చివరి ప్రయత్నంగా కొలంబియా యూనివర్సిటీ ఫర్టిలిటీ సెంటర్‌ను (సీయూఎఫ్‌సీ) సంప్రదించారు.ఈ జంట సమస్య తెలుసుకున్న అక్కడ పరిశోధకులు ఒక కొత్త టెక్నిక్‌ను ఉపయోగించారు. స్పెర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (ఎస్‌టీఏఆర్-స్టార్) అనే విధానంలో మహిళ భర్త వీర్యంలో దాగి ఉన్న ఒక వీర్యకణాన్ని కష్టపడి గుర్తించారు. 

AI: వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. కృత్రిమ మేధ సాయంతో గర్భం దాల్చిన మహిళ

పరిశోధకుల బృందం దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడి

తన కల నిజం కాబోతోందని తెలుసుకున్న ఆ మహిళ చాలా సంతోషించింది. ఆమె మాట్లాడుతూ, ఇది నిజమని నమ్మడానికి నాకు రెండు రోజులు పట్టింది అని తెలిపింది. తన సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంది. సీయూఎఫ్‌సీ డైరెక్టర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడి ఈ స్టార్ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధానం అద్భుతమైన ఫలితం ఇవ్వడంతో పరిశోధకుల బృందం కూడా ఆశ్చర్యపోయింది.ఈ సందర్భంగా డాక్టర్ విలియమ్స్ (Dr. Williams) మాట్లాడుతూ ఆ పేషెంట్ మాకు శాంపిల్ ఇచ్చారు. అందులో వీర్య కణం కోసం నిపుణులు రెండు రోజుల పాటు వెతికినా ఒక్కటి కూడా కనిపించలేదు. కానీ స్టార్ విధానంలో శాంపిల్‌ను పరిశీలిస్తే కేవలం గంటలోనే వీర్య కణాల జాడ బయటపడింది.

ప్రయోజనాత్మక వైద్య విజయం

కేవలం గంట వ్యవధిలో 44 వీర్య కణాలను గుర్తించాము. ఇది వైద్య రంగంలో ఒక గొప్ప మలుపు అని మాకు అప్పుడే అర్థమైంది. ఇది చాలా మంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది అని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీతో పిల్లలు లేని దంపతులకు ఒక కొత్త ఆశ చిగురించింది. ఏఐ టెక్నాలజీ సాయంతో సంతానం పొందడం అనేది నిజంగా ఒక అద్భుతం అంటున్నారు.ఈ ఘట్టం వైద్యరంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. గతంలో ఇది అసాధ్యమనే అభిప్రాయం ఉండేది. కానీ AI టెక్నాలజీ AI (Technology) కారణంగా ఇప్పుడు ఇది సాధ్యమైంది. ఇది కేవలం ఆ దంపతుల కలను నెరవేర్చడమే కాకుండా, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న అనేక మందికి ఆశ వెలుగులు నూరుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul R Singh: ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

#AIinHealthcare #AIInMedicine #AIMiracle #AIPregnancy #AItechnology #ArtificialIntelligence #Azoospermia #ChildlessToParents #FertilityTech #HopeThroughAI #InfertilitySolution #IVFSuccess #IVFWithAI #MedicalMiracle #ReproductiveHealth 18 years childless couple AI in fertility AI in IVF AI in reproductive health AI miracle AI success story AI-assisted pregnancy Ap News in Telugu Artificial Intelligence in medicine artificial intelligence pregnancy case azoospermia treatment Breaking News in Telugu Google News in Telugu healthcare innovation infertility solution infertility technology IVF with AI Latest News in Telugu medical breakthrough Paper Telugu News sperm detection using AI Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.