हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Adani shares : అదానీ షేర్ల ర్యాలీతో మార్కెట్ పతనాన్ని కాపాడింది

Sai Kiran
Adani shares : అదానీ షేర్ల ర్యాలీతో మార్కెట్ పతనాన్ని కాపాడింది

Adani shares : భారత స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు రోజుల లాభాల జోరుకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల దిగ్గజ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే అదానీ గ్రూప్ (Adani shares) షేర్లలో నమోదైన భారీ ర్యాలీ మార్కెట్లను మరింత పతనం నుంచి కాపాడింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇచ్చిన క్లీన్ చిట్ అదానీ షేర్లకు బలాన్నిచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు నష్టపోయి 82,626.23 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు తగ్గి 25,327.05 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 82,485.92 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

మార్కెట్ మొత్తం డీలా పడినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లు పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇచ్చాయి. అదానీ పవర్ షేరు 13.42 శాతం పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్ 7.55 శాతం లాభపడగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.25 శాతం, అదానీ పోర్ట్స్ 1.15 శాతం పెరిగాయి.

మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే అదానీ పోర్ట్స్‌తో పాటు ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో నిలిచాయి.

రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్, ఆటో, ఐటీ, FMCG, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు నష్టపోయాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నిలకడగా ట్రేడ్ అయ్యాయి. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా బలపడి 88.10 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇది 88.13 వద్ద ఉంది.

Read also :

https://vaartha.com/today-gold-silver-prices-sep-19-2025/today-gold-rate/550102/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870