📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Gautam Adani: పన్నుల చెల్లింపులో రికార్డు సృష్టించిన అదాని

Author Icon By Vanipushpa
Updated: June 5, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ పారిశ్రామికదిగ్గజం గౌతమ్ అదాని(Gautam Adan)కి చెందిన అదాని గ్రూప్.. రికార్డు సృష్టించింది. లిస్టెడ్ సంస్థల పోర్ట్‌ఫోలియో ద్వారా 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 74,945 కోట్ల రూపాయల పన్నులను చెల్లించింది. ఇది- గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2023- 24తో పోల్చుకుంటే 29 శాతం అధికం. ఆ ఆర్థిక సంవత్సరంలో అదాని గ్రూప్.. మొత్తం 58,104 కోట్ల రూపాయల మేర పన్నులు చెల్లించగా.. ఇప్పుడీ మొత్తం 74,945 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మొత్తం- దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అదానీ గ్రూప్(Adani Groups) ఏ స్థాయిలో భాగస్వామ్యం వహిస్తోందో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ 74,945 కోట్ల రూపాయల్లో ప్రత్యక్ష పన్నుల వాటా 28,720 కోట్ల రూపాయలు. పరోక్ష పన్నుల వాటా.. 45,407 కోట్ల రూపాయలు. ఇతరత్ర పన్నుల మొత్తం 818 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.

Gautam Adani: పన్నుల చెల్లింపులో రికార్డు సృష్టించిన అదాని

కోట్లాదిమంది ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో నెట్‌వర్క్ ను నిర్మించడానికి అవసరం అయ్యే ఖర్చుతో దాదాపుగా ఇది సమానం. ఆధునిక ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ఈ మొత్తం దాదాపు సరిపోతుంది. అలాగే- కోట్లాదిమంది ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో జీవనాడిగా నిలుస్తుందని అదాని గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదానీ గ్రూప్ పబ్లిక్ లిస్టెడ్ సంస్థల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ సిమెంట్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. ఈ పన్నుల చెల్లింపుల్లో కీలకంగా మారాయి. పన్నుల రూపేణా వేల కోట్ల రూపాయల మేర నిధులను ప్రభుత్వ ఖజానాకు సమకూర్చాయి.
న్నుల చెల్లింపుల ద్వారానే దేశంలో మౌలిక సదుపాయాలు
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తో పాటు ఎన్డీటీవీ, ఏసీసీ, సంఘీ ఇండస్ట్రీస్ కూడా పన్నులు చెల్లించిన లిస్టెడ్ సంస్థల జాబితాలో ఉన్నాయి. ఈ గ్రూప్.. తన ఏడు సంస్థల వెబ్‌సైట్లలో బేసిస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ అప్రోచ్ టు ట్యాక్స్ అనే పేరుతో ఓ డాక్యుమెంట్ ను అందుబాటులో ఉంచింది.

పూర్తి సమాచారం

పన్నుల చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది. ప్రంచవ్యాప్తంగా పోర్ట్‌ఫోలియో కంపెనీలు కొనసాగించే వ్యాపార, వాణిజ్య లావాదేవీల ద్వారా వచ్చే పన్నులు, సుంకాలు, ఇతర ఛార్జీలను ప్రత్యక్ష పన్నుల జాబితాలో చేర్చిందీ సంస్థ. ఇతర స్టేక్ హోల్డర్ల నుంచి సేకరించిన పోర్ట్‌ఫోలియో కంపెనీలకు సంబంధించిన మొత్తం చెల్లింపులను ఇండైరెక్ట్ ట్యాక్సుల్లో కలిపింది.
అదానీ గ్రూప్ పన్ను పారదర్శకతను సంస్థ కార్యకలాల్లో కీలకంగా పరిగణిస్తోంది. పన్నుల చెల్లింపుల ద్వారానే దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని భావిస్తోన్నామని పేర్కొంది. సకాలంలో పన్నుల చెల్లింపు.. తమ సంస్థ పారదర్శకత, దేశ సమగ్రాభిభివృద్ధిలో చిత్తశుద్ధికి అద్దం పడుతోందని వెల్లడించింది.

Read Also: Earthquakes : పాకిస్థాన్‌లో 21 సార్లు కంపించిన భూమి

#telugu News Adani sets record Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in tax payments Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.