BRS team to SLBC tunnel today

నేడు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌కు బీఆర్‌ఎస్‌ బృందం

తమను పోలీసులు అడ్డుకోవద్దన హరీష్ రావు

హైదరాబాద్‌: ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు నేడు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నాయకులతో కలిసి వెళ్లనున్నారు. అయితే తమను పోలీసులు అడ్డుకోవద్దని హరీష్ రావు అన్నారు. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు తాము అక్కడికి వెళ్లలేదని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీప్రాంతంలోని దోమలపెంట వద్ద గత శనివారం సొరంగం పనులు జరుగుతుండగా భారీ ప్రమాదం సంభవించి 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.

Advertisements
నేడు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌కు బీఆర్‌ఎస్‌

అందుకే ఇంతకాలం అక్కడికి తాము వెళ్లలేదు

సొరంగం ప్రమాదంలో జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయకచర్యలకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇంతకాలం అక్కడికి తాము వెళ్లలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. సహాయక చర్యలను పరిశీలించి తమవైపు నుంచి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయటానికి ఘటనా స్థలికి వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశించారని వివరించారు. తమ పర్యటనకు రాజకీయ ఉద్దేశం ఏమీలేదని స్పష్టం చేశారు.

తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు

గల్లంతైన కార్మీకుల ఆచూకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, రాళ్లు, శిథిలాలు, తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది. సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మీకులు బయటకు వచ్చేందుకు పరుగెత్తి ఉంటారని, వారు శిథిలాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాను వివరించింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటి రెండురోజుల్లోనే కార్మీకుల ఆచూకీ లభ్యం కావచ్చని భావిస్తున్నారు. తవ్వకాలు, శిథిలాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా నిపుణులు సూచించారు.

Related Posts
Chebrolu Kiran: జగన్ భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్
వైఎస్ భారతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త అరెస్ట్

జగన్ భార్య వైఎస్ భారతి పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ Read more

తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలు
12 new municipalities in Te

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం Read more

కోహ్లి ఈజ్ బ్యాక్
kohli

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి ఫామ్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. గత కొన్ని నెలలుగా అతని ప్రదర్శన అంతగా మెరుగ్గా Read more

రాష్ట్రీయ విద్యా దినోత్సవం!
edu

ప్రతి సంవత్సరం నవంబర్ 11న రాష్ట్రీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు, భారతదేశం స్వతంత్రం తరువాత తొలి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ Read more

×