BRS leader Errolla Srinivas arrested.

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్.. !

హైదరాబాద్‌: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నోటీసులు ఇచ్చేందుకు మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని మాసబ్‌ట్యాంక్‌ పీఎస్‌కు తరలించారు.

Advertisements

ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేస్తున్నదని విమర్శించారు. ప్రశ్నించిన వారిని కాంగ్రెస్‌ సర్కార్‌ వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 14 ఏండ్లపాటు ఉద్యమంలో పాల్గొన్నానని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా పనిచేశానని చెప్పారు. తెల్లవారుజామున వచ్చి ఇంటి డోర్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెడుతున్నదని మండిపడ్డారు. ఎన్నికేసులు పెట్టినా, ఎంత నిర్బంధం విధించినా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Related Posts
15 నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలకు విసుగు – కేటీఆర్
He won by showing heaven in the palm of his hand.. KTR

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, 15 నెలల పాలనతోనే విసుగు చెంది పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి Read more

జగిత్యాల ఆసుపత్రిలో నర్సుల క్రిస్మస్ వేడుకలు కలకలం
Nurses' Christmas celebrati

జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నర్సులు, సిబ్బంది క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ రోగులను గాలికి వదిలేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం ఈ సంఘటన Read more

నుమాయిష్ లో చేదు సంఘటన
నుమాయిష్ లో చేదు సంఘటన

జాయ్ రైడ్ కోసం డబుల్ ఆర్మ్ రేంజర్లో ఉన్నవారికి భయంకరమైన అనుభవం కలిగింది, ఎందుకంటే యంత్రం సాంకేతిక సమస్యను అభివృద్ధి చేసిన తర్వాత వారు తలక్రిందులుగా ఉండవలసి Read more

Pawan Kalyan: త్వరలో జిల్లాల పర్యటనపై వెళ్లనున్నడిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: త్వరలో జిల్లాల పర్యటనపై వెళ్లనున్నడిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. తాను కేవలం అధికారి Read more

Advertisements
×