అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ మాజీ గూఢచారిపై పరువునష్టం దావా వేయాలని ప్రయత్నించిన ట్రంప్‌కు లండన్ హైకోర్టు జరిమానా విధించింది. ఆరోపణలను నిరూపించడంలో విఫలమైన కారణంగా న్యాయ ఖర్చుల కింద ట్రంప్ $7,41,000 (డాలర్లు) చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది.
యూకే గూఢచార సంస్థ ఎంఐ6 మాజీ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ 2017లో ట్రంప్‌పై సంచలన పత్రాన్ని విడుదల చేశారు. ఆ పత్రంలో ట్రంప్ రష్యన్ ఏజెంట్లతో రాజీకి వచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, క్రిస్టోఫర్ స్టీల్‌పై పరువునష్టం కేసు వేశారు.

Donald Trump: ట్రంప్‌కు బ్రిటన్ కోర్టు జరిమానా విధింపు
Advertisements