📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad : 60వేల ఉద్యోగాలిచ్చాం.. కాదని నిరూపిస్తే క్షమాపణ చెబుతా – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: July 4, 2025 • 7:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గురించి చెప్పారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఈ విషయంలో తనపై ఎవరైనా ప్రశ్నించాలంటే మోదీ, కేసీఆర్, కేటీఆర్‌ మాదిరి నేతలే ఉండాలన్నారు. ఒక్క ఉద్యోగం తక్కువగా ఇచ్చినట్లు నిరూపిస్తే వారి కాళ్ల ముందే క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు.

మహిళలందరూ కోటీశ్వరులవుతారు – రేవంత్ హామీ

తెలంగాణలోని కోటి మంది మహిళలను (Womens ) ఆర్థికంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములుగా చేసి వారిని కోటీశ్వరులుగా మార్చేందుకు కార్యచరణ చేపడతామని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని తానే స్వయంగా ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం ద్వారా సమాజమే మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విపక్షాల విమర్శలకు ఘాటు ప్రతిస్పందన

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చారని సీఎం రేవంత్ విపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా తమ ప్రభుత్వం స్పష్టతతో పనిచేస్తోందని తెలిపారు. వాస్తవాలను అవహేళన చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, ఇకపై మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also : Assembly Elections : 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – సీఎం రేవంత్

cm revanth congress party Google News in Telugu job calendar 2024 telangana jobs Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.