हिन्दी | Epaper

Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ విడుదల

Sharanya
Vishwambhara: ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ నేడు విడుదలైంది. ఎం.ఎం కీరవాణి బాణీలు స‌మ‌కూర్చిన‌ ఈ పాటకు స‌ర‌స్వ‌తిపుత్ర‌ రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శంక‌ర్ మ‌హాదేవ‌న్‌, లిప్సికా ఆల‌పించారు.

చిరు డ్యాన్స్

చిరంజీవి ఈ పాటలో తనదైన స్టైల్‌తో చేసిన డివోషనల్ డ్యాన్స్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాట విన‌సొంపుగా ఉండి, శ్రోతుల‌ను ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శ్రీరాముడి గొప్ప‌త‌నం ఈ పాట‌లో వివ‌రించారు. అలాగే చిరు కూడా త‌న‌దైన గ్రేస్‌తో పాట‌పై డ్యాన్స్ చేయ‌డం చూస్తుంటే ఈ సాంగ్ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. పాటలోని సంగీత భావాన్ని తన అభినయంతో మిళితం చేస్తూ, ప్రతి స్టెప్‌ను ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా తీర్చిదిద్దారు. ఈ చిత్రం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన‌ ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘రామ రామ’ పాట కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు పెంచేసింది.

Read also: OTT: తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న చావా ఎక్కడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కవితకు సీబీఐ షాక్, కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు

కవితకు సీబీఐ షాక్, కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

చికెన్ కోసం తమ్ముడినే చంపిన అన్న..

చికెన్ కోసం తమ్ముడినే చంపిన అన్న..

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

విద్యార్థులకు అలర్ట్.. 45 మార్కులు వస్తేనే పాస్!

విద్యార్థులకు అలర్ట్.. 45 మార్కులు వస్తేనే పాస్!

పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు!

పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

ఆహార కల్తీలో మన భాగ్యనగరమే నంబర్ వన్

ఆహార కల్తీలో మన భాగ్యనగరమే నంబర్ వన్

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

📢 For Advertisement Booking: 98481 12870