Laddu Controversy : రాష్ట్రంలో లడ్డూ తప్ప ఇంకే సమస్య లేదా ? – అంబటి రాంబాబు

Read Time:  1 min
Ambati Rambabu
Ambati Rambabu
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ‘తిరుమల లడ్డూ’ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగం, అభివృద్ధి, సామాజిక పింఛన్లు వంటి అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కనపెట్టి కేవలం లడ్డూ చుట్టూనే రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం వెనుక రాజకీయ ప్రయోజనాలు తప్ప భక్తి లేదని అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శించారు.

Hyderabad-Goa Greenfield Highway : హైదరాబాద్-గోవా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక అప్డేట్

మరోవైపు, ఈ వ్యవహారంలో చట్టపరమైన ప్రక్రియను కూడా అంబటి ప్రస్తావించారు. లడ్డూ నాణ్యత లేదా నెయ్యి కల్తీ అంశంపై ఇప్పటికే సిబిఐ (CBI) కమిటీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, అటువంటప్పుడు ఇంకా వక్రీకరణలు ఎందుకని ఆయన నిలదీశారు. వాస్తవాలను పక్కనపెట్టి దైవానికి సంబంధించిన అంశాలను రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తప్పకుండా శ్రీవారి ఆగ్రహానికి గురవుతారని ఆయన హెచ్చరించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వాస్తవమేంటో వారికి తెలుసని చెబుతూ.. ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.