Telangana housing scheme : ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర గ్రీన్ సిగ్నల్, లక్షల మందికి ఊరట!

Read Time:  1 min
Telangana housing scheme
Telangana housing scheme
FONT SIZE
GET APP

Telangana housing scheme : తెలంగాణ లో Revanth Reddy ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రంలో నిర్మించనున్న ఇళ్లకు కేంద్రం తన వాటాను విడుదల చేయనుండటంతో లక్షలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుంది.

పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేల చొప్పున కేంద్రం మంజూరు చేయనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు 4.13 లక్షల ఇళ్లకు కేంద్ర నిధులు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పీఎంఏవై-అర్బన్ 2.0 కింద 1.13 లక్షల ఇళ్లు కేటాయించగా, ఇప్పటికే 10 వేల ఇళ్లకు ఆమోదం లభించింది. మిగిలిన ఇళ్ల కోసం వేల కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.

Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

Telangana housing scheme
Telangana housing scheme

గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా ఇళ్లు మంజూరయ్యే అవకాశముంది. పీఎంఏవై-గ్రామీణ్ కింద దాదాపు 3 లక్షల ఇళ్లకు నిధులు రానున్నాయి. అదనంగా, ఆదివాసీల కోసం ప్రత్యేకంగా 10 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు కేటాయించడం విశేషం. ఈ చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.