West Bengal : పశ్చిమ్ బెంగాల్‌లో ఉద్యోగాల నుంచి తొలగించిన 25 వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు భారీగా ఊరట కలిగించింది. కొత్త రిక్రూట్‌మెంట్ పూర్తయి.. కొత్తవారు ఉద్యోగాల్లో చేరే వరకూ వారిని కొనసాగించడానికి అనుమతించింది. విద్యార్థులు ఇబ్బంది పడకూడదని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. బెంగాల్‌లో వెలుగుచూసిన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కుంభకోణం.. ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ గుర్తించిన సుప్రీంకోర్టు.. ఆ 25 వేల మంది టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ నియమాక ప్రక్రియ డిసెంబరు 31 నాటికి పూర్తిచేయాలి
అయితే, బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు మాత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం డెడ్‌లైన్ విధించింది. కొత్త రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషణ్‌ను మే 31లోగా విడుదల చేయాలని.. ఈ నియమాక ప్రక్రియ డిసెంబరు 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించింది. ‘‘9, 10, 11, 12 తరగతుల అసిస్టెంట్ టీచర్లకు సంబంధించిన మేరకు దాఖలైన అభ్యర్థనను మేము ఆమోదించామనే అభిప్రాయంలో ఉన్నాం. అయితే, కొన్ని షరతులకు లోబడే ఇది వర్తిస్తుంది. కొత్త నియామకాల కోసం ప్రకటన మే 31వ తేదీ లోపల నోటిఫికేషన్ విడుదల చేయాలి.
పై విధంగా ప్రకటన విడుదల చేయకపోతే కఠినమైన చర్యలు
పరీక్షతో సహా మొత్తం నియామక ప్రక్రియ డిసెంబర్ 31వ తేదీకి పూర్తికావాలి.. రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ మే 31లోపు లేదా అంతకు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. అందులో ప్రకటన కాపీతో పాటు షెడ్యూల్‌ను కూడా జతచేయాలి. తద్వారా డిసెంబర్ 31లోపు నియామక ప్రక్రియ పూర్తయినట్టు నిర్దారణ అవుతుంది.. పై విధంగా ప్రకటన విడుదల చేయకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
దాదాపు 25 వేల టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ
బెంగాల్ ప్రభుత్వం 201 లో దాదాపు 25 వేల టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నియమాక ప్రక్రియ కోసం నిర్వహించిన పరీక్షలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టాలని కోర్టుల్లో భారీగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అర్హత లేని వారు, తక్కువ మార్కులు వచ్చిన వేలాది మంది అభ్యర్థులను టీచర్లుగా, నాన్ టీచింగ్ సిబ్బందిగా నియమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల నుంచి భారీగా లంచాలు తీసుకుని.. అర్హులైన, మెరిట్ అభ్యర్థులను పక్కనపెట్టారని అభ్యర్థులు ఆరోపించారు.
Read Also: రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఖరారు