తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు దాదాపు రెండు నెలలపాటు ఇంటర్ విద్యార్థులు సెలవులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు నేటి నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాలేజీలు జూన్ 2వ తేదీన తిరిగి పునఃప్రారంభమవనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, బోధన సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులు ప్రకటించారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పరీక్షలు పూర్తి
తెలంగాణ ఇంటర్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను మార్చి 5వ తేదీ నుంచి మార్చి 20 వరకు నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల మధ్యలో పరీక్షలు జరిగాయి.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు నిర్వహించగా, ఇప్పుడు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను 17 నుంచి 19కి పెంచి, జవాబు పత్రాలను దిద్దేందుకు 14,000 మంది ఎగ్జామినర్లు నియమితులయ్యారు.ఫలితాలను ఏప్రిల్ నెల చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
చర్యలు
ఇంటర్ బోర్డు ప్రకటన ప్రకారం, జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ఏ కాలేజీ కూడా క్లాసులు నిర్వహించరాదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.
ఫ్యూచర్ కోర్సులు
ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో, విద్యార్థులు వారి సెలవులను ప్లాన్ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా మంది హాలిడే ట్రిప్స్, వేసవి శిక్షణ శిబిరాలు, హాబీ కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవచ్చు.అంతేకాక,ఫ్యూచర్ కోర్సులకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వేసవి సెలవుల అనంతరం జూన్ 2 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
సరికొత్త అవకాశాలు
ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ చివరిలో విడుదల,రివాల్యుయేషన్, రీ-కౌంటింగ్ ప్రక్రియ మే నెలలో,ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు,జూన్ 2న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు సరికొత్త అవకాశాలను సద్వినియోగంచేసుకొని, భవిష్యత్తు లో జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు సూచించింది.