📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Smoking : ప్లీజ్.. ఆ పని చేయకండి అంటున్న అల్లు అర్జున్

Author Icon By Sudheer
Updated: May 31, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువతపై సినీ హీరోల ప్రభావం ఎక్కువ. అందుకే వారితో ప్రకటనలు చేసేందుకు కంపెనీలు సిద్ధమవుతుంటాయి. అయితే తమ అభిమానులకు హాని చేసే వాటిని వ్యతిరేకించేవారు కొంతమంది హీరోలు ఉంటారు అలాంటి వారిలో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. తాజాగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘ప్లీజ్ పొగ తాగకండి’ అని అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ చేయడంపై ప్రశంసలొస్తున్నాయి.

దమ్ము కొట్టొద్దు బ్రదర్

పొగాకు వల్ల ప్రజలకు కలిగే అనర్థాలను వివరిస్తూ…‌‌ పొగాకు, పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ బీడీ గుట్కా వంటి వాటికి నో చెప్పాలని ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ‘వరల్డ్ నో టొబాకో డే’ (World No Tobacco Day) పలువురు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో స్మోకింగ్ కిల్స్ క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ ధరించి ”బి ఫైర్… (ఫైరులా ఉండండి). పొగలా కాదు. దమ్ము కొట్టొద్దు బ్రదర్” అని పేర్కొన్నారు.

Read Also : Trump:చైనా విద్యార్థులకు ట్రంప్ భరోసా!

గద్దర్ బెస్ట్ యాక్టర్

ఇదిలా ఉంటె ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా ఇస్తున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు మొదటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు సాధించాడు. బెస్ట్ యాక్టర్ గా తెలంగాణ స్టేట్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సెట్ చేసాడు. ఈ రికార్డ్ బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో. భవిష్యత్తులో నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు వేరే హీరోలు అందుకోవచ్చు ఏమో గాని మొదటిసారి అనే రికార్డ్ మాత్రం అల్లు అర్జున్ పేరుమీదే.

‘ఐకాన్’ టైటిల్ తో బన్నీ కొత్త మూవీ

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే… అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘ఐకాన్’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

View this post on Instagram

A post shared by Allu Arjun (@alluarjunonline)

Allu Arjun gaddar award pushpa 2 World No Tobacco Day

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.