📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telanagana:దశల వారీగా వందే భారత్ రైళ్లకు కసరత్తు

Author Icon By Anusha
Updated: April 16, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా రైల్వే సేవలను మెరుగుపరచే దిశగా కేంద్ర రైల్వే శాఖ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో, సేవలను విస్తరించడానికి ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం, పలు మార్గాల్లో సేవలు పెంచడం వంటి నిర్ణయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వందేభారత్ ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో రైల్వే శాఖ తీసుకువచ్చిన కొత్త విధానం ప్రయాణీకులకు వెసులుబాటు కల్పించనుంది. దశల వారీగా ఈ నిర్ణయం విస్తరించేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

పంచవటి ఎక్స్‌ప్రెస్‌

తొలి సారిగా ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సెంట్రల్‌ రైల్వే మొదటిసారిగా ముంబయి మన్నాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌తో ప్రయోగాత్మకంగా ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి కదిలే ఏటీఎంలు ఏర్పాటుకు నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రైళ్లలో ఈ ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి దీనిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఏటీఎం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మన్మాడ్ జంక్షన్

ఏసీ ఛైర్‌కార్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో ప్యాంట్రీ ఉండేది. ఆ స్థలంలోనే ఈ కొత్త ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి ఓ షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు. అలాగే కోచ్‌లో ఏటీఎం ఏర్పాటు కు అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేయించారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌ ప్రతి రోజూ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్లి వస్తుంటుంది. సుమారు 4.30 గంటల్లోనే ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మిగిలిన ప్రధాన రైళ్లల్లో అన్ని జోన్ల పరిధిలో ఈ తరహాలో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుత ఏటీఎంల పైన ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని అవసరమైన మార్పులతో దేశ వ్యాప్తంగా అమలుకు నిర్ణయించారు.

Read Also: Telangana : బీసీ రిజర్వేషన్–ఎస్సీ వర్గీకరణలో ముందస్తు

#IndianRailways #PassengerConvenience #RailwayUpdate #SummerSpecialTrains #TrainTravelIndia #VandebharatExpress Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.