📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: పాకిస్థాన్ అసలైన రంగు బయటపడింది..

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిండా మునిగాక చలి ఏంటనే రితీలో- ఇన్ని రోజులు ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదన్న పాకిస్థాన్​ ఇప్పుడు స్వరం మార్చింది. ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయని బహిరంగాగానే ఒప్పుకుంటోంది. పాక్​ అసలు నిజం ఇప్పుడు బయటపడుతోంది. పాకిస్థాన్​- ఉగ్రమూకలను పోషించినట్లు, దాదాపు 30 ఏళ్లుగా ఆ పని అమెరికా కోసం చేసినట్లు ఇటీవల ఆ దేశ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ వెల్లడించారు. తాజాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి కూడా అదే బాటలో నడిచారు. గతంలో ఉగ్రవాదులతో తమకు సంబంధాలు ఉండేవని నిజం ఒప్పుకున్నారు. దాని వల్ల దేశం చాలా కోల్పోయిందని చెప్పారు.

రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
“రక్షణ మంత్రి(క్వాజా ఆసిఫ్ ) చెప్పిన దాని ప్రకారం, పాకిస్థాన్‌కు గతం(ఉగ్రవాదులతో సంబంధాలు) ఉందనే విషయం రహస్యమని నేను భావించడం లేదు. దాని కారణంగా మనం, పాకిస్థాన్​ బాధపడింది. మనం ఉగ్రవాదం, అతివాదాలను ఎదుర్కొన్నాం. కానీ మనం అనుభవించిన దాని ఫలితంగా, పాఠాలు కూడా నేర్చుకున్నాం. ఈ సమస్యను పరిష్కరించడానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్​ చరిత్ర చూసుకుంటే, అప్పుడు చేసిన తప్పు మనం ఇప్పుడు చేయడం లేదు. అది మన చరిత్రలో ఒక దురదృష్టకర భాగం అనేది నిజం” అని అన్నారు.
అయితే, ఇంతకుముందు గురువారం మీర్పుర్​ఖాస్​లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన భుట్టో మరోసారి శాంతి వచనాలు వల్లెవేశారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని, కానీ భారత్ తమను రెచ్చగొడితే యూద్ధానికి సిద్ధంగా ఉందని మేకపోతు గాంభీర్య ప్రదర్శించారు.
“మేము శాంతిని కోరుకుంటాం, కానీ రెచ్చగొడితే తట్టుకోలేరు”
“పాకిస్తాన్ శాంతియుత దేశం, ఇస్లాం శాంతియుత మతం. మేము యుద్ధం కోరుకోము. కానీ ఎవరైనా మన సింధుపై దాడి చేస్తే, వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. మేము యుద్ధ ఢంకా మోగించము. కానీ రెచ్చగొడితే, పాకిస్థాన్ అంతా ఒక్కటై గర్జిస్తే మీరు తట్టుకోలేరు” అని భుట్టో అవాకులు చెవాకులు పేలారు. పాక్ నేతలు ఒకవైపు ఉగ్రవాదంతో తమ చారిత్రక సంబంధాలను ఒప్పుకుంటూ, మరోవైపు భారత్‌పై మేకపోతు గాంభీర్యంతో శాంతి సందేశాలు వినిపిస్తూ, యుద్ధ భాష్యం కూడా మాట్లాడుతున్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒప్పుకోలు పాక్‌పై ఉన్న అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది.
FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) వంటి సంస్థలు ఇలాంటి ప్రకటనలను ఆధారంగా తీసుకుని ఆంక్షలపై పునర్విమర్శ చేయవచ్చు. అంతేకాదు, భారత్‌తో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతల మధ్య ఈ అభిప్రాయాలు పాక్ బలహీనతగా ప్రచారమవుతున్నాయి.

Read Also: Pakistan Currency : పాకిస్థాన్ ఆర్థిక స్థితి : పొరుగు దేశాలకు ఆమడంత దూరం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu have been revealed.. Latest News in Telugu Pakistan's true colors Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.