బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన నిన్న మరోమారు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఆయన హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

పూర్తి వివరాలు
KCR: అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆయన యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital) చేరిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 5వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆ సమయంలో వారం తర్వాత మళ్లీ ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన నిన్న ఉదయం ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించుకున్న అనంతరం కె. చంద్రశేఖర్ రావు సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వెంట ఆయన సతీమణి శోభ, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ ఫేమస్ సీఎం ఎవరు?
చంద్రశేఖర్ రావు పార్టీని అధికారంలోకి తెచ్చి, జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 1954లో మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో జన్మించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (సాహిత్యం) పూర్తి చేశారు. శ్రీమతి శోభను వివాహం చేసుకున్నారు మరియు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.
కెసిఆర్ జీవిత చరిత్ర ఎవరు?
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (జననం 17 ఫిబ్రవరి 1954) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. ఆయన భారత రాష్ట్ర సమితి స్థాపకుడు మరియు నాయకుడు. తెలంగాణ భారత రాష్ట్రంగా మారడానికి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినందుకు ఆయన ప్రసిద్ధి చెందారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: CM Revanth : చర్చకు రమ్మంటే సీఎం తోకముడిచి పారిపోయాడు – కవిత