ఉద్యోగులకు భారతీయ రైల్వే (Indian Railway)తీపికబురు చెప్పింది. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ (Bonus)ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10.91లక్షల మంది ఉద్యోగులకు రూ.1865.68 కోట్ల బోనస్ చెల్లించనున్నది. ఈ సందర్భంగా కేంబినెట్ బిహార్‌లో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. తర్వలోనే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.2,192 కోట్లతో రైల్వే (Indian Railway) డబ్లింగ్‌కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భక్తియార్‌పూర్-రాజ్‌గిర్-తిలయ్యా రైల్వేలైన్‌కు ఆమోదించింది.

అలాగే, రూ.3,822.31 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ఇచ్చింది. మోదీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్‌ను ఆమోదించింది. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్టంగా రూ.17,951 చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని వివిధ రకాల రైల్వే ఉద్యోగులకు ఇవ్వనున్నారు. ఇందులో ట్రాక్ మెయింటెయినర్లు, లోకోమోటివ్ పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సీ ఉద్యోగులు ఉన్నారు. 2024-25 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుంది. రైల్వేలు రికార్డు స్థాయిలో 1614.90 మిలియన్ టన్నుల సరుకును.. దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను రవాణా చేశాయని ప్రభుత్వం తెలిపింది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్‌కు కేంద్ర మంత్రి కూడా ఆమోదం తెలిపారని వైష్ణవ్ వెల్లడించారు.
భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచింది?
భారతదేశంలో మొట్టమొదటి రైలు 1837లో మద్రాసులోని రెడ్ హిల్స్ నుండి చింతప్రేట్ వంతెన వరకు, విలియం అవేరీ తయారుచేసిన రోటరీ స్టీమ్-ఇంజిన్ లోకోమోటివ్ తో నడిచింది. అయితే, 1853 ఏప్రిల్ 16న బొంబాయి (ప్రస్తుతం ముంబై)లోని బోరి బందర్ నుండి థానే వరకు నడిచిన మొదటి ప్యాసింజర్ రైలు, భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయి.
భారతదేశంలో ఎన్ని రైల్వే డివిజన్లు ఉన్నాయి?
ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వేలు, 2022 నాటికి దాని 19 రైల్వే జోన్‌లు మరియు 68 డివిజన్‌లలో 123,236 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఏప్రిల్ 14, 1951న స్థాపించబడిన దక్షిణ జోన్ మొదటగా కార్యాచరణలోకి వచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: