📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Harsh Goenka: సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా అంటూ గోయెంకా తీవ్ర విచారం వ్యక్తం

Author Icon By Anusha
Updated: June 5, 2025 • 1:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా (Harsh Goenka) స్పందించారు. గతంలో చోటు చేసుకున్న మేజర్‌ తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా, అంటూ ప్రశ్నించారు.

ఎవరూ బాధ్యత

‘ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట. కుంభమేళాలో తొక్కిసలాట. బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట. ఆయా ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలూ లేవు. జవాబుదారీతనం లేదు. పాఠాలూ నేర్చుకోలేదు. భారతదేశంలో సామాన్యుడి జీవితం అమూల్యమైనది కాదా, విలువలేదా, వారి ప్రాణం విలువ ఒక కప్పు చాయ్ కంటే చౌకగా మారింది, ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగా సాగుతోంది. ఏమీ మారట్లేదు’ అంటూ ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఏర్పాటు చేసిన

పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్‌ టైటిల్‌ని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్‌ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం, నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.

గోయెంకా ఆవేదన

“మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ ఒక కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు” అంటూ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు.

Harsh Goenka

బాధ్యతగా వ్యవహరించాల్సిన

హర్ష్ గోయెంకా చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది చాలా దురదృష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే, అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది” అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు సామాన్యుల భద్రతపై ప్రభుత్వాలు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అభిప్రాయపడ్డారు.

Read Also: Bengaluru Stampede:మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం సిద్దరామయ్య

# Harsh Goyonka #BengaluruNews #BengaluruStampede #RCBVictoryCelebration #RCBTragedy #StampedeTragedy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.