దేశవ్యాప్తంగా మూడురంగుల పండుగ (CJ) ఘనంగా జరుగుతున్నది. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఢిల్లీలో ఎర్రకోటవద్ద దేశప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేసారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ స్పీకర్ (స్పీకర్) అయన్నపాత్రుడు, శాసనమండలిలో ఛైర్మన్ మోజేస్ రాజు జాతీయ జండాలను ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాలను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
CJ:స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న స్పీకర్, హైకోర్టు సీజే
Read Time:
1 min
Tags:
Google News in Telugu
High Court CJ celebrations
Speaker Independence Day
Telangana High Court Chief Justice
Telugu News Today
రచయిత గురించి
Sai Kiran
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.