📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ChandrababuNaidu: P-4 చైర్మన్‌గా చంద్రబాబు వైస్‌ చైర్మన్‌గా పవన్‌ కల్యాణ్‌

Author Icon By Anusha
Updated: April 9, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా, ఇప్పుడు పలు కీలక ప్రాజెక్టులకు చైర్మన్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కోసం ఈ కీలక బాధ్యతలు స్వయంగా తన భుజాలపై తీసుకున్నారు. ముఖ్యంగా పోలవరం, అమరావతి వంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఇకపై మరింత వేగంగా ముందుకెళ్లేలా ఆయన కార్యాచరణ రూపొందించారు.ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు, త్వరలోనే అక్కడ ప్రగతిపథంలో జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.  ఏపీకి రెండు కళ్లు పోలవరం, అమరావతి. ఈ మాట తరచూ చెబుతుంటారు చంద్రబాబు. ఆ పోలవరాన్ని కలిపే జలహారతి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనుల దాకా అంతా తానై వ్యవహరిస్తున్నారు చంద్రబాబు.

జలహారతి కార్పొరేషన్‌

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీ సర్కార్‌ దీన్ని ఏర్పాటుచేసింది. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది. దీనికి చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సంస్థ సీఈఓగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ఉంటారు.

వైస్‌ చైర్‌ పర్సన్‌

P-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 విజన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఈమధ్యే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీ4 విధానం ప్రకారం టాప్ పదిశాతంలో ఉన్న సంపన్న వ్యక్తులు, లేదా సంస్థలు అట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఆదుకోవాలి. పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, ఎల్‌పీజీ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆచరణలోనే మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు చైర్‌ పర్సన్‌గా P-4 సొసైటీ ఏర్పాటయ్యింది. దీనికి వైస్‌ చైర్‌ పర్సన్‌గా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉంటారు. సీఈవో, డైరెక్టర్‌తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, సాంకేతిక బృందం, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్​లు ఏర్పాటు చేయనున్నారు.ఆగస్టులోగా ఈ సొసైటీకి విధివిధానాలు రూపొందిస్తారు. 5 లక్షల కుటుంబాలను సంపన్నులు దత్తత తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు లక్ష్యం.

Read Also: Congress : దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం – షర్మిల

#AmaravatiCapital #APCMChandrababu #APDevelopment #ChairmanChandrababu #PolavaramProject Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.