📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Prabhas: ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు..అసలు ఏంజరిగిందంటే..!

Author Icon By Anusha
Updated: March 30, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ,ది రాజా సాబ్ షూటింగ్ పూర్తికావొచ్చింది. అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం కూడా త్వరలో షూటింగ్ ప్రారంభించనుంది. ప్రభాస్‌ పీఆర్వోగా చెప్పుకునే సురేష్ కొండి అనే వ్యక్తిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యూట్యూబ్ జర్నలిస్ట్‌పై బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు అయ్యింది.

టైటిల్

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 44లో ఉన్న ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేస్తున్న అసోసియేట్ ఎడిటర్ ఇటీవల ప్రభాస్ ఆరోగ్యంపై ఓ వీడియో పోస్ట్ చేశాడు. “డార్లింగ్ ఇన్ డేంజర్” అనే టైటిల్ తో విడుదలైన ఈ వీడియోలో, ప్రభాస్ మేజర్ సర్జరీ చేయించుకున్నాడని పేర్కొన్నాడు. ఈ వార్త వైరల్‌గా మారడంతో, ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

బెదిరింపులు

ఈ వీడియోపై ప్రభాస్ పీఆర్వోగా చెప్పుకునే సురేష్ కొండి స్పందించాడు. ఆయన జర్నలిస్టుకు ఫోన్ చేసి, “మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. వెంటనే వీడియోను డిలీట్ చేయాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొనబడింది. అయితే, జర్నలిస్ట్ వీడియోను తొలగించడానికి అంగీకరించలేదు.దీంతో, సురేష్ కొండి ఆ వీడియోను ప్రభాస్ అభిమానులకు పంపించాడు. ఆ వీడియోను చూసిన అభిమానులు జర్నలిస్టుకు ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా తీవ్రంగా హెచ్చరించారు. “నిన్ను చంపేస్తాం.. మీ ఆఫీసును తగలబెడతాం” అంటూ బెదిరింపులు పంపించారు.

ఫ్యాన్స్ దాడి

ఈ వివాదం ఇంకా ముదిరి, మార్చి న కొంత మంది యువకులు జర్నలిస్ట్ కార్యాలయానికి చేరుకున్నారు. తాము ప్రభాస్ అభిమానులమంటూ గొడవకు దిగారు. భయపడ్డ జర్నలిస్ట్ వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

పోలీసు కేసు

ఈ ఘటనలో ప్రధాన బాధ్యుడు సురేష్ కొండియేనని, ఆయన కారణంగా తనకు ప్రాణహాని ఉందని బాధిత జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు, సురేష్ కొండిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటన టాలీవుడ్‌లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో కూడా ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. జర్నలిస్టులపై బెదిరింపులు తగవని, అభిమానులు మరింత సంయమనంతో వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు ప్రభాస్ అభిమానులపై ఎలా ప్రభావం చూపుతుందనేది చూడాలి.

#Prabha #PrabhasFans #SocialMedia #TheRajaSaab Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.