📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Bed : బెడ్ మీద ఇలా చేయకండి!

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 9:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనలో చాలామంది అలవాటుగా తడి టవల్స్‌ను, వాడిన దుస్తులను బెడ్‌పై వేసేస్తుంటాం. ఇవి సర్వసాధారణమైన విషయాలుగానే అనిపించవచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ఇలాంటి అలవాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తడి వస్తువులు బెడ్‌పై ఉంచినప్పుడు, ఆ తడి వల్ల దుప్పట్లు, పరుపు నెమ్మదిగా తడిగా మారతాయి. దాంతో వాతావరణానికి అనుకూలంగా క్రిములు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు.

వాస్తవానికి, మన శరీరం నుంచి నిత్యం కొన్ని సూక్ష్మక్రిములు విడుదలవుతుంటాయి. వాడిన దుస్తులు బెడ్‌పై ఉంచితే, అవి ఆ క్రిములను పరుపుపైకి తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువసేపు మంచంపై గడిపే సమయంలో, ఈ క్రిములు చర్మ సమస్యలు, అలెర్జీలు, శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంతేకాకుండా, బయట తిరిగొచ్చిన వెంటనే కాళ్లు కడకుండానే మంచంపైకి చేరడం కూడా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. బయట అడుగుపెట్టిన పాదాల్లో ఎంతో మలినాలు చేరే అవకాశం ఉంది. అవే నేరుగా బెడ్‌పై పడితే, అక్కడి పరిశుభ్రత దెబ్బతింటుంది. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బెడ్‌ను శుభ్రంగా ఉంచడం, తడి వస్తువులు దూరంగా ఉంచడం, దుస్తులను సరిగా హ్యాంగ్ చేయడం ఎంతో ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

bed Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.